Lasith Malinga: శ్రీలంక మాజీ క్రికెటర్, యార్కర్ కింగ్ లసిత్ మలింగ గురించి పరిచయం అక్కర్లేదు. శ్రీలంక భయంకరమైన లెజెండరీ బౌలర్లలో లసిత్ మలింగ ఒకరు. తన బౌలింగ్ యాక్షన్, గింగిరాల జుట్టుతో {Lasith Malinga} ఎంతో ప్రసిద్ధి చెందాడు. అద్భుతమైన యార్కర్లతో ప్రపంచంలోని గొప్ప గొప్ప బ్యాట్స్మెన్ లనే బోల్తా కొట్టించాడు. మలింగ బౌలింగ్ శైలి విచిత్రంగా ఉంటుంది. అతడు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని వేస్తే ఎంతటి బ్యాట్స్మెన్ అయినా ఇబ్బంది పడాల్సిందే.
Also Read: Khalistan Supporters: బాక్సింగ్ డే టెస్టులో కలకలం.. మ్యాచ్ అడ్డుకునేందుకు ఖలిస్థానీల కుట్రలు?
ఒకవేళ బ్యాట్స్మెన్ బంతిని బౌండరీ తరలించినా అతడు నవ్వుతూనే ఉంటాడు. ఏ సందర్భంలోనూ అసహనానికి గురికాడు. అంతేకాదు ఎలాంటి వివాదాలు లేకుండా సహచర ఆటగాళ్లను {Lasith Malinga} కలుపుకొని పోతాడు. తన కెరీర్ లో శ్రీలంకకు అనేక విజయాలు అందించిన మలింగ.. ఇప్పుడు సింగర్ గా సరికొత్త అవతారం ఎత్తాడు. ఇప్పటికే సాంగ్ రైటర్ గా ఎంటర్టైన్ చేస్తున్న ఈ యార్కర్ కింగ్.. కొత్తగా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టాడు.
ఇందుకు సంబంధించి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో.. మలింగ శ్రీలంక సాంప్రదాయ సంగీతాన్ని పాడుతూ కనిపించాడు. దీంతో మలింగ {Lasith Malinga} పాట పాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు తమ అభిమాన క్రికెటర్ లోని కొత్తకోనాన్ని చూసి మురిసిపోతున్నారు. తన బౌలింగ్ తో క్రికెట్ లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో.. ఇప్పుడు సంగీత ప్రపంచంలో కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందాలని కామెంట్స్ చేస్తున్నారు.
మలింగ మధురమైన వోకల్స్, సంగీతం పట్ల అతడికి ఉన్న అమితమైన ప్రేమ, శ్రీలంక సంస్కృతిపై ఉన్న అనుబంధం అతని పాటలో ప్రతిబింబిస్తుంది. గతంలో పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేసిన మలింగ.. శ్రీలంక సింగర్ లతో గొంతు కలిపాడు. ఆయన {Lasith Malinga} పాడిన కొన్ని పాటలు హిందీలో కూడా డబ్ అయ్యాయి. తాజాగా ఓ సాంగ్ ని ఆయన పాడారు. ఈ పాట సంగీత ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Also Read: Rohit Sharma – Yashasvi Jaiswal: ఓరేయ్ గల్లీ క్రికెట్ ఆడుతున్నావా.. జైస్వాల్ కు రోహిత్ వార్నింగ్ ?
ఇక మలింగ {Lasith Malinga} తన కెరీర్ లో 30 టెస్టులు ఆడి కేవలం 275 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇక టెస్టుల్లో 33.15 సగటుతో 101 వికెట్లు తీశాడు. అలాగే 226 వన్డేలు ఆడిన మలింగ 567 పరుగులు చేశాడు. ఇందులో కూడా ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక వన్డేలలో 28.87 సగటుతో 338 వికెట్లు పడగొట్టాడు. ఇక టి20 ల విషయానికి వస్తే 84 t-20 లలో 136 పరుగులు సాధించాడు. ఈ టి-20 లలో 20.36 సగటుతో 107 వికెట్లు తీశాడు.
From Slinga Malinga to Singer Malinga!
One of the all time greats, Lasith Malinga 😍🥰 pic.twitter.com/98sxoaAAoc— Dr. Jo (@ERDrJo) December 25, 2024