Chandhu Mondeti: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లో చందు మొండేటి ఒకరు. కార్తికేయ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. నిఖిల్, స్వాతి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా ప్రేమమ్ అనే సినిమాను తెరకెక్కించాడు. మలయాళం లో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత చందు మొండేటి కేవలం నిఖిల్ నాగచైతన్య వంటి హీరోలతో మాత్రమే సినిమాలు చేశాడు. చందు కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా కార్తికేయ 2. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ సాధించాడు చందు.
కార్తికేయ సినిమా హిట్ అయిన తర్వాత చందు ని చాలామంది హీరోలు పిలిచి మాట్లాడారట. అయితే ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చందు మొండేటి కథను విన్నారు. చందు మొండేటి కథను విన్న జూనియర్ ఎన్టీఆర్. అదిరిపోయింది చందు దీనిని కొంచెం డెవలప్ చెయ్ అంటూ మాట్లాడారట. మామూలుగా ఒక స్టార్ హీరో ఒక సినిమా కథ బాగుంది దీనిని డెవలప్ చెయ్ అనగానే అదేపనిగా కొంతమంది దర్శకులు చేస్తూ ఉంటారు. కానీ చందు ఆ కథ మీద అంతగా మళ్లీ పని చేయలేదు. ఒకపక్క ఎన్టీఆర్ తన ప్రాజెక్టుతో బిజీ అయిపోతూ వచ్చాడు. ఒక సందర్భంలో చందు మొండేటి అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి హీరోలతో కూడా సినిమాలు చేస్తాడు అని వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు ఆ సినిమాలు కూడా పట్టాలు ఎక్కలేదు. అయితే వీటన్నిటికీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు చందు.
Also Read : Khushi Kapoor: మా అమ్మ సినిమాల్లో నా ఫేవరెట్ అదే.. బయటపెట్టిన ఖుషి కపూర్
నేను కార్తికేయ సినిమా హిట్ అయిన తర్వాత చాలామంది హీరోలను కలిశాను. పెద్ద పెద్ద హీరోలను కలుస్తున్న ప్రాసెస్ లో చాలా ఎంజాయ్ చేశాను. కానీ నేను కంఫర్ట్ జోన్ లో ఉండటం, అదే హీరోలకి అలవాటు పడటంతో మళ్లీ మళ్లీ ఆ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు నేను తండేల్ సినిమాను చేశాను. మళ్లీ నా నెక్స్ట్ సినిమా నిఖిల్ తో ఉంటుంది. కార్తికేయ 2 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సీక్వెల్ గా తెరకెక్కబోయే పార్ట్ 3 కేవలం నిఖిల్ తోనే చేయాలి. ఇలా చేసిన హీరోలతో మళ్లీ మళ్లీ చేస్తూ ఉండటం వలన, చందు మరో స్టార్ హీరోతో సినిమా చేయలేక సతమతమవుతున్నారు. ఒకసారి చందు తన కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తే యంగ్ దర్శకుడు బాబి లాగా, అనిల్ రావిపూడి లాగా అందరి హీరోలను కవర్ చేయొచ్చు. ఇక కార్తికేయ 3 తర్వాత అయినా మరో హీరోతో చందు ప్రాజెక్టు అనౌన్స్ చేస్తాడో లేదో వేచి చూడాలి.
Also Read : Suriya: సూపర్ హీరో పాత్రలో సూర్య.. మలయాళ దర్శకుడితో కలిసి ప్రయోగం..