E-Paper
Advertisement

శ్రీలంక ప్రీమియ‌ర్ లీగ్ లో కొత్త రూల్..టాలెంట్ ప‌నికిరాదు, 250K ఫాలోవ‌ర్స్ ఉన్న ప్లేయ‌ర్ల‌కే ఎంట్రీ

శ్రీలంక ప్రీమియ‌ర్ లీగ్ లో కొత్త రూల్..టాలెంట్ ప‌నికిరాదు, 250K ఫాలోవ‌ర్స్ ఉన్న ప్లేయ‌ర్ల‌కే ఎంట్రీ
Advertisement

LPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్… మే 31వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈ టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలోనే లంక ప్రీమియర్ లీగ్ ( Lanka Premier League 2026) గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది జూలై 10వ తేదీ నుంచి లంక ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ షురూ కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇలాంటి నేపథ్యంలో శ్రీలంక ప్రీమియర్ లీగ్ యాజమాన్యం వినూత్నమైన కండిషన్ పెట్టింది. ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటేనే ఈ టోర్నమెంట్లో ఆడే అవకాశం ఉంటుందని లేకపోతే నో ఛాన్స్ అంటూ తేల్చి చెప్పేసింది.

Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

శ్రీలంక ప్రీమియర్ లీగ్ లో ఆడాలంటే ఫాలోవర్స్ ఉండాల్సిందే

Advertisement

శ్రీలంక ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ జూలై మాసంలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ టోర్నమెంట్ లో ఆడాలనుకునే ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఓ కండిషన్ ఫాలో కావాల్సిందేనని తాజాగా యాజమాన్యం ప్రకటన చేసింది. ఇందులో ఆడాలనుకునే ప్రతి ప్లేయర్ 2.50 లక్షల ఫాలోవర్స్ ను కలిగి ఉండాలని కండిషన్ పెట్టింది. 250K ఫాలోవర్స్ లేకపోతే ఈ టోర్నమెంటులో ఆడేది లేదని తేల్చి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు గుర్తింపు రావాలన్న ముఖ్య లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ కండిషన్ పెట్టిన నేపథ్యంలో క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. టాలెంట్ ఉన్న ప్లేయర్లను తీసుకోవాలి తప్ప.. ఫాలోవర్స్ ఉన్న ప్లేయర్లు ఎందుకు అని నిలదీస్తున్నారు. ఇలా అయితే శ్రీలంక ప్రీమియర్ లీగ్ ( LPL 2026) అట్టర్ ఫ్లాఫ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఇండియన్ ఫాన్స్ మరోలా స్పందిస్తున్నారు. ఎవ్వరిని చేసినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ను కొట్టే మొనగాడు ఎవడు లేడని కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీలంక ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఎప్పటి నుంచి అంటే ?

శ్రీలంక ప్రీమియర్ లీ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. జూలై 10వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు అంటే దాదాపు నెలరోజుల పాటు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగుతుంది. ఇవాల్టి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ టోర్నమెంట్ లో ఆడాలంటే 250k ఫాలోవర్లు ఉండాలని.. అలాంటి ప్లేయర్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. మే 8వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మెగా టోర్నమెంట్ కోసం మొత్తం నాలుగు స్టేడియాలను సిద్ధం చేశారు. SSC కొలంబో, ప్రేమదాస స్టేడియం, పల్లె కెలే, రంగిరి దంబుల్ల ఇంటర్నేషనల్ స్టేడియాలను సిద్ధం చేశారు.

Advertisement

Also Read: Alastair Cook: IPL ఓన‌ర్ల‌కు ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు, టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు Alastair Cook !

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×