IPL 2025 Play Off: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా…. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్న మెంట్ లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నలభై ఓ మ్యాచ్ జరుగుతుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి ఇంటర్నేషనల్ స్టేడియంలో… ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో లక్నో సూపర్ జెంట్స్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తోంది. లక్నో పిచ్ పైన…. మొదట బౌలింగ్ చేసిన జట్టు ఎక్కువగా విజయాలు సాధించే ఛాన్సులు ఉన్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(w), అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్
పాయింట్స్ టేబుల్ లో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్
పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ దూసుకు వెళ్తోంది. ఎనిమిది మ్యాచ్లో 6 మ్యాచ్లు గెలిచి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ రెండవ స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి అదరగొడుతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం అయితే… టాప్ ఫోర్ లో ఉన్న జట్లు అన్ని క్వాలిఫై అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఈ నాలుగు జట్లు ప్లే ఆఫ్ కు వెళ్తే… మిగిలిన జట్లని ఇంటికి వెళ్తాయి.
ప్రమాదంలో హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… హైదరాబాద్ జట్టు అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ప్రమాదంలో ఉన్నాయి. ఈ రెండు జట్లు అట్టడుగులో ఉన్నాయి. కచ్చితంగా ఈ రెండు జట్లతో పాటు… ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్ జెంట్స్, రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ కూడా ఇంటికి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఇకనుంచి ఈ జట్లు… వరుసగా విజయాలు సాధిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఇప్పటివరకు పాయింట్ల పట్టిక ప్రకారం ఈ లెక్కలు ఉన్నాయి.