BigTV English
Advertisement

Mahvash: ధోని దెబ్బకు… చాహల్ కు లైన్ క్లియర్… ప్రియురాలు ముద్దులు ఒకటే తక్కువ

Mahvash: ధోని దెబ్బకు… చాహల్ కు లైన్ క్లియర్… ప్రియురాలు ముద్దులు ఒకటే తక్కువ

Mahvash: ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం రోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడి.. ఈ సీజన్ లో వరుసగా నాలుగవ పరాజయాన్ని మూటగట్టుకుంది. పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 43 బంతులలో 103 పరుగులతో మెరుపు సెంచరీ చేశాడు. ఇక మరో బ్యాటర్ శశాంక్ సింగ్ 36 బంతులలో 52 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు.


 

చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య చేదనలో చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై బ్యాటర్లలో డేవిడ్ కాన్వే 49 బంతులలో 69, రచిన్ రవీంద్ర 23 బంతుల్లో 36 పరుగులతో రాణించారు. ఇక మహేంద్ర సింగ్ ధోని 12 బంతుల్లో 27 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో 5వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన మహేంద్రసింగ్ ధోని.. ఆశించినత స్థాయిలో వేగంగా ఆడలేక పోయాడు.


కానీ ఉన్న కాసేపైనా తన అభిమానులను అలరించేలా భారీ షాట్లు ఆడాడు. 12 బంతుల్లో 225 స్ట్రైక్ రేట్ తో ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేశాడు. చివరిగా ఆఖరి ఓవర్ లో యష్ ఠాకూర్ బౌలింగ్ లో.. చాహల్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. అయితే ధోని ఆడిన షాట్ ని.. కాస్త భయపడుతూనే తన చేతిలోకి తీసుకున్నాడు చాహల్. ఈ నేపథ్యంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన రేడియో జాకి ఆర్జే మహ్వాష్.. చాహల్ క్యాచ్ పట్టగానే ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అదరహో అన్నట్లుగా ఉన్నాయి.

చాహల్ క్యాచ్ తీసుకున్న తర్వాత ఆర్జే మహ్వాష్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే చాహల్ తన భార్యతో విడాకులు తీసుకున్న అనంతరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, రేడియో జాకి మహ్వాష్ తో డేటింగ్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చాహల్ క్యాచ్ అనంతరం వీరి గురించి మరోసారి సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైంది.

అయితే ఇటీవలే వీరిద్దరి మధ్య వస్తున్న రూమర్స్ పై మహ్వాష్ మౌనం విడింది. తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. ” ప్రస్తుతం నేను ఎవరితో డేటింగ్ లో లేను. సింగిల్ గానే ఉన్నాను. నేను క్యాజువల్ డేటింగ్ ని నమ్మను. గతంలో ఓ వ్యక్తితో నాకు నిశ్చితార్థం జరిగింది. ఆ బంధం తెగిపోయింది. ప్రస్తుతం నేను ఒంటరిగా, చాలా సంతోషంగా ఉన్నాను.

 

నేటి కాలంలో నాకు పెళ్లి అనే భావన పూర్తిగా అర్థం కాలేదు. నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే డేటింగ్ కి వెళతాను. అది కూడా క్యాజువల్ డేటింగ్ కి కాదు. పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తితో మాత్రమే డేటింగ్ చేస్తా” అంటూ చెప్పుకొచ్చింది. అయితే ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ మళ్లీ ప్రేమలో పడ్డట్టు తరచూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ని మహ్వాష్ తో కలిసి వీక్షించాడు చాహల్.

Related News

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌, వేదిక‌లు ఖ‌రారు..ఇండియాకు రాబోమంటున్న‌ పాకిస్తాన్ ?

Quinton de Kock : రిటైర్మెంట్ వెన‌క్కి తీసుకుని, రీ-ఎంట్రీ ఇచ్చాడు…సెంచ‌రీతో పాకిస్తాన్ ను చిత్తు చేశాడు

Big Stories

×