Virat Kohli – Rajat Patidar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు {ఆర్సీబీ} తమ జట్టుకు కొత్త కెప్టెన్ ని ఎంపిక చేసింది. తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ ని ప్రకటించింది. యువ ఆటగాడు రజత్ పటీదార్ ని కెప్టెన్ గా నియమించింది. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సిబి కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగబోతోంది.
Also Read: Indian Cricketers: టీమిండియా ప్లేయర్లకు సెలవులు.. ఇంటికి పయనం… వీడియో వైరల్ !
ఐపీఎల్ 2024 సీజన్ వరకు కెప్టెన్ గా ఉన్న సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డూప్లెసిస్ ని ఐపీఎల్ 2025 మెగా వేలంలో బెంగుళూరు వదిలేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సిబి జట్టుకు కెప్టెన్సీ కొరత ఏర్పడింది. అయితే ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సిబి కెప్టెన్ గా మళ్లీ విరాట్ కోహ్లీనే నియమిస్తారని వార్తలు వచ్చాయి. కానీ బెంగుళూరు యాజమాన్యం ఇప్పుడు కోహ్లీని కాకుండా రజత్ పటిదార్ కి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.
డూప్లిసిస్ కి ముందు విరాట్ కోహ్లీ బెంగళూరు టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సమయంలో తనకు కెప్టెన్సీ వద్దని కోహ్లీ పక్కకు తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో మళ్లీ కెప్టెన్సీ విరాట్ కోహ్లీని చేరలేదు. భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా కూడా కెప్టెన్సీ రేసులో లో నిలిచినప్పటికీ.. జట్టు భవిష్యత్తు అవసరాల దృశ్య రజత్ పటిదార్ కి కెప్టెన్సీ బాధ్యతలను ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది.
అయితే పటిదార్ ని కెప్టెన్ గా నియమించడం పట్ల {Virat Kohli – Rajat Patidar} తాజాగా ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు విరాట్ కోహ్లీ. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ” నాతో పాటు జట్టు సభ్యులందరం.. మీ వెంటే ఉంటాం. ఈ ఫ్రాంచైజీలో మీరు ఎదిగిన విధానం, మీరు ప్రదర్శించిన తీరుతో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు అభిమానులందరికీ గుండెల్లో స్థానం సంపాదించారు.
నాయకత్వ బాధ్యతలకు మీరు అర్హులు ” అంటూ రజత్ పటిదార్ కి శుభాకాంక్షలు తెలిపారు విరాట్ కోహ్లీ. అయితే అతడిని కెప్టెన్ గా నియమించడాన్ని కొంతమంది విరాట్ కోహ్లీ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. కెప్టెన్సీ బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించాలని.. ఈ నియామకం విరాట్ కోహ్లీ కి కూడా ఇష్టం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Rajat Patidar RCB Captain: ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. RCB కొత్త కెప్టెన్ ఇతనే !
ఈ కెప్టెన్సీ నిర్ణయం తమని నిరుత్సాహానికి గురిచేసిందని అంటున్నారు. అయితే రజత్ పటిదార్ గత సీజన్ లోతన విధ్వంసకర బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడని, అతడినే కెప్టెన్ గా నియమించడం సరైనదేనని మరికొంతమంది అంటున్నారు. విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తే అధిక భారం పడుతుందని మరికొంతమంది మాట.
VIRAT KOHLI CONGRATULATING RAJAT PATIDAR ON RCB CAPTAINCY.
– What a beautiful video! ❤️pic.twitter.com/mSQcqdXjYa
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2025