BigTV English

England vs Australia: ఫైనల్లో గెలిచాక ఫస్ట్ వన్డేలోనే షాక్..

England vs Australia: ఫైనల్లో గెలిచాక ఫస్ట్ వన్డేలోనే షాక్..

England vs Australia : T20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు… ఫైనల్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్ లోనే షాకిచ్చారు… కంగారూలు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా అడిలైడ్ లో జరిగిన తొలి వన్డేలో… ఇంగ్లండ్ పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది… ఆస్ట్రేలియా. ఇంగ్లండ్ బ్యాటర్ మలాన్ ఒక్కడే సూపర్ సెంచరీతో జట్టు స్కోరులో సగం చేసినా… జట్టును గెలిపించలేకపోయాడు.


టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్… 31 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయింది. జేసన్ రాయ్, జేమ్స్ విన్స్, ఫిల్ సాల్ట్ తక్కువ స్కోరుకే ఔటవడంతో… ఇంగ్లండ్ జట్టు కష్టాల్లోపడింది. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా డేవిడ్ మలన్ మాత్రం దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. 46వ ఓవర్ దాకా ఆడిన మలన్… 128 బంతుల్లోనే 134 రన్స్ చేశాడు. అందులో 4 సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి. జోస్ బట్లర్, డేవిడ్ విల్లీ ఫరవాలేదనేలా ఆడటంతో… 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.. ఇంగ్లండ్. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్, ఆడమ్ జంపా మూడేసి వికెట్లు తీసుకోగా… మైకేల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్ కు చెరో వికెట్ దక్కింది.

288 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియాకు.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, హెడ్ అద్భుత భాగస్వామ్యాన్ని అందించారు. తొలి వికెట్ కు ఏకంగా 147 రన్స్ జోడించాడు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో… 20 ఓవర్లలోనే 148 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. డేవిడ్‌ వార్నర్‌ 86 పరుగులు చేయగా… హెడ్‌ 69 రన్స్ చేశాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ మిగతా బ్యాటర్లతో కలిసి గేమ్ ను ఫినిష్ చేశాడు. 78 బంతుల్లో ఒక సిక్సర్ 9 ఫోర్లతో 80 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.. స్మిత్. అయితే… సూపర్ సెంచరీ చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ మలన్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×