E-Paper
Advertisement

Tanveer Ahmed: 2027 కాదు, 2040 వ‌చ్చినా పాకిస్తాన్ కు వ‌ర‌ల్డ్ క‌ప్ రాదు..రాసిపెట్టుకోండి

Tanveer Ahmed: 2027 కాదు, 2040 వ‌చ్చినా పాకిస్తాన్ కు వ‌ర‌ల్డ్ క‌ప్ రాదు..రాసిపెట్టుకోండి
Advertisement

Tanveer Ahmed:  టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో టీమిండియా చాంపియన్ అయితే, పాకిస్తాన్ మాత్రం బంగ్లాదేశ్ లో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan, 1st ODI) మధ్య నిన్న వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఈ మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లోనే చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టును దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. స్వయంగా పాకిస్తాన్ అభిమానులే తమ జట్టుకు వ్యతిరేకంగా పోస్టులు కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ కూడా విమర్శలు చేశారు. ఇలాగే పాకిస్తాన్ ఆడితే 2040 వచ్చినా కూడా ప్రపంచ కప్ గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌ని బాంబు పేల్చారు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ).

Also Read: T20 World Cup 2026: సంజు అదిరిపోయే ఇన్నింగ్స్‌..ఉద్యోగుల‌కు రూ.2.5 లక్షలు బోన‌స్ ఇచ్చిన కేర‌ళ వ్యాపార‌వేత్త‌

2027 కాదు 2040 వచ్చినా కూడా పాకిస్తాన్ కు వరల్డ్ కప్ రాదు

Advertisement

టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 దశలో ఇంటి దారి పట్టిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో చావు దెబ్బ తిన్నది. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న మొదటి వన్డే జరగగా, చిత్తుగా పాకిస్తాన్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ స్పందించారు. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ ప్లేయర్లు గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోవాలని మండిపడ్డారు. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు పైన కూడా ఆడ లేకపోతే ఎలా? అంటూ నిలదీశారు. ఇలా వన్డేల్లో పాకిస్తాన్ ప్రదర్శన కనబరిస్తే 2027 కాదు.. 2040 వచ్చిన కూడా వన్డే వరల్డ్ కప్ గెలవడం కష్టమే అని షాకింగ్ కామెంట్స్ చేశారు తన్వీర్ అహ్మద్.

ఐసీసీ టోర్నమెంట్లే కాదు.. ఆసియా కప్ గెలవడం కూడా పాకిస్తాన్ వల్ల కాదని చురకలు అంటించారు. అసలు పాకిస్తాన్ జట్టులో క్రమశిక్షణ లేకుండా పోయిందని విమర్శలు చేశారు. పాకిస్తాన్ ప్లేయర్లు అసలు ఫిట్నెస్ లో ఉన్నారనే దానిపైన క్లారిటీ లేదని మండిపడ్డారు. దీనిపై పరీక్షలు చేసే వాళ్లే లేరని సీరియస్ అయ్యారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసలు చీమకుట్టినట్లు కూడా వ్యవహరించడం లేదని ఇబ్బంది పడ్డారు. ఇప్పటికైనా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన మార్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.

8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్తాన్

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్నటి నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభమైంది. ఇందులో తొలి వన్డే ఢాకా వేదికగా జరిగింది. ఇందులో ఎనిమిది వికెట్ల తేడాతో పాకిస్తాన్ పైన విజయం సాధించింది బంగ్లాదేశ్. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా 114 పరుగులు చేసింది పాకిస్తాన్. ఈ లక్ష్యాన్ని 15 ఓవర్లలోనే ఊది పడేసింది బంగ్లాదేశ్. దీంతో బంగ్లా గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Also Read: T20 World Cup 2026: కొంప‌ముంచిన‌ గిల్ సెల‌క్ష‌న్…గంభీర్, అగార్క‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు, టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు !

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×