Dhruv Jurel: ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ జట్టుకు వికెట్ కీపింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ముగ్గురు తమదైన క్లాస్ బ్యాటింగ్, అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ తో సత్తా చాటుతున్నారు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడవ టెస్ట్ లో భారత జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
Also Read: Asia Cup 2025 schedule: ఇండియా-పాక్ మ్యాచ్ కు ముహూర్తం ఫిక్స్… ఎప్పుడంటే
తొలిరోజు ఆట సందర్భంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్ లో రెండవ బంతిని అందుకునే క్రమంలో రిషబ్ పంత్ ఎడమ చేతి వేలికి గాయమైంది. ఆ బంతిని అందుకున్నాక పంత్ తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. అంతకుముందు ఓవర్ లో కూడా కాస్త అసౌకర్యంగా కనిపించాడు. ఇక గాయం అనంతరం ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినప్పటికీ అతడి నొప్పి తగ్గలేదు.
ఈ క్రమంలోనే రిషబ్ పంత్ ఫిజియో సాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్థానంలో సబ్స్టిట్యూడ్ వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్ మైదానంలోకి వచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్ మాత్రమే చేయగలిగాడు పంత్. ఇక మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో కూడా ధ్రువ్ జురెల్ ని జట్టులోకి తీసుకున్నారు. నాలుగోవ టెస్టులో రిషబ్ పంత్ కుడి కాలి బొటనవేలు విరగడంతో.. అతడికి ఆరువారాలపాటు రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు.
అయినప్పటికీ గాయం తోనే మరోసారి మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు రిషబ్ పంత్. ఇక పంత్ స్థానంలో దృవ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం పంత్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి రాకపోతే.. అతడి స్థానంలో జురెల్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. ఐసీసీ ప్రస్తుత టెస్ట్ రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు కంకషన్ కి గురైనప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయం ఆటగాడిని భర్తీ చేయగలడు. ఇక రిషబ్ పంత్ గాయం అతని కాలికి సంబంధించింది. తలకు సంబంధించింది కాదు కాబట్టి జూరెల్ ఫీల్డింగ్ ప్రత్యామ్న్యాయం మాత్రమే.
అతను కీపింగ్ చేయడానికి మాత్రమే అర్హత ఉంటుంది. బ్యాటింగ్ చేయడానికి అర్హత లేదు. అయితే రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపింగ్ చేస్తున్న దృవ్ జురెల్.. మూడవ టెస్ట్ లో ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న 4వ టెస్టులో కూడా రిషబ్ పంత్ స్థానంలో కీపింగ్ చేస్తున్నాడు జురెల్. ఈ నాలుగోవ టెస్టులో కూడా క్యాచ్ లు మిస్ చేయడం, వికెట్ల వెనక చురుగ్గా కదలకపోవడం, బౌండరీలు సమర్పించుకుంటున్నాడని మండిపడుతున్నారు అభిమానులు. ఈ క్రమంలో జురెల్ పై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. కీపింగ్ సరిగ్గా చేయాలని సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link