Ishan Kishan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. కీలక దశలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. శుక్రవారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో… RCB దారుణంగా ఓడిపోయింది. అయితే బెంగళూరు ఓటమికి ముఖ్య కారణం హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్. గతంలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఇషాన్ కిషన్.. హైదరాబాద్ జట్టు పైన ప్రమాదకరమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు.
Also Read: Ban on CSK – RR : 2016, 2017 లో రాజస్థాన్, CSK పై బ్యాన్.. కారణం ధోని కుట్రలేనా?
ముంబై తో చేతులు కలిపిన ఇషాన్ కిషన్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఏకంగా 42 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ ఆటగాడు కిషన్ కిషన్ 48 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్సర్లతో పాటు ఏడు బౌండరీలు ఉన్నాయి. 195.83 స్ట్రైక్ రేటు తో రఫ్పాడించాడు ఇషాన్ కిషన్. అయితే మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన ఈశాన్ కిషన్ ఆ తర్వాత హైదరాబాద్ జట్టు తరఫున ఏ ఒక్క మ్యాచ్లో కూడా పెద్దగా రాణించలేదు. అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. ఇలాంటి నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.
అయితే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రం అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్ హైదరాబాదుకు పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ మనోడు మాత్రం ఇరగదీశాడు. దీంతో.. ఇషాన్ కిషన్ భారీ ఇన్నింగ్స్ వెనుక ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇషాన్ కిషన్.. అద్భుతంగా ఆడి హైదరాబాద్ ను గెలిపిస్తే.. ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్లు ఆడింది. ఇందులో 17 పాయింట్లు సంపాదించింది. హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది కనుక మరో మ్యాచ్ లో ఓడిపోతే.. పాయింట్ల పట్టికలో బెంగళూరు నాలుగో స్థానానికి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక ముంబై ఇండియన్స్ మరొక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందులో కచ్చితంగా గెలుస్తుంది అని అందరూ అంటున్నారు. అదే జరిగితే ముంబైకి 18 పాయింట్లు లభిస్తాయి. దింతో రెండవ స్థానానికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అందుకే.. ఇషాన్ కిషన్ బాగా ఆడి… హైదరాబాదును ఓడించి ముంబైకి రూట్ క్లియర్ చేశాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read: Nitish Kumar Reddy: టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి షాక్….అకౌంట్ హ్యాక్?
ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో కూడా ఈశాన్ కిషన్ కుట్రలు
ముంబై వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ అవుట్ కాకపోయినా కూడా… తానే వెళ్లిపోయాడు. ఇషాన్ కిషన్ వెళ్లిపోవడాన్ని… చూసి అంపైర్ అవుట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఇషాన్ కిషన్ పైన ట్రోలింగ్ జరిగింది.