OTT Movies: యాక్షన్, హారర్, మిస్టరీ థ్రిల్లర్ చిత్రాల చిత్రాలకు సినీ అభిమానులు ఎక్కువ. ఈ జానర్ సినిమాలు చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు భాషతో సంబంధం లేకుండ ఈ సినిమాలకు ఆదరణ పెరిగిపోతుంది. ఓటీటీలు వచ్చాక వాటికి మరింత ఆదరణ పెరిగిపోయింది. అందుకే ఓటీటీ సంస్థలు సైతం ఈ జానర్ చిత్రాలపైనే ఫోకస్ పెడుతోంది. థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను ఉత్కంఠ పరిచేందుకు ఓటీటీలు సరికొత్త కాన్సెప్ట్ తో ప్రతివారం హారర్, యాక్షన్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. ఇప్పుడు మరో హారర్, మర్డర్ మిస్టరీని కూడా తీసుకురాబోతుంది. త్వరలోనే ఓటీటీలోకి ఓ మస్టర్ మిస్టరీ మూవీ రాబోతోంది. థియేటర్లలో టాప్ రేటింగ్ తో ట్రెండింగ్ లో ఉన్న ఈ చిత్రం పేరు డిటెక్టివ్ కీన్. ఇది వియత్నం హారర్ డ్రామా. త్వరలోనే ఇది నెట్ ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కథ, కథనం ఏంటీ.. ఆడియన్స్ అంతగా అట్రాక్ట్ చేస్తోన్న ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం.
డిటెక్టివ్ కీన్.. హెడ్‌లెస్ హారర్.. మూవీ ఇది. 19వ శతాబ్దంలోని వియత్నాంలో, న్గుయెన్ రాజవంశ కాలంలో ఒక గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఓ మర్టర్ మిస్టరీగా ఈ సినిమా సాగుతుంది. హారర్, రొమాన్స్, యాక్షన్ డ్రామా సాంప్రదాయ వియత్నామీస్ సమాజంలో స్త్రీల గుర్తింపు, అధికారి దుర్వినియోగం ప్రధాన కథనం. మూఢానమ్మకాలతో ఆ గ్రామంలోని ప్రజల రహస్యాలు, కుట్రలు, భయాలను ఛేదిస్తుంది. రెండు గంటల 32 నిమిషాల నిడివితో ఈ చిత్రం ఊహించని ట్విస్ట్ లతో ప్రతి క్షణం ప్రేక్షకులను ఉత్కంఠ గురి చేస్తుంది థ్రిల్ చేస్తుంది.
కథేంటంటే
ఒక చిన్న మారుమూల గ్రామంలో ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా సరస్సు ఒడ్డున తలలు లేని శవాలు కనిపిస్తుంటాయి. స్థానికులను ఈ శవాలను “డ్రౌనింగ్ ఘోస్ట్” (మా డా) అనే ఆత్మతో ముడిపెట్టి చూస్తారు. దీనికి ఆ గ్రామానికి శాపంగా భావిస్తూ భయంతో జీవిస్తున్నారు. ఈ తరుణంలో ఆ గ్రామానికి చెందిన న్గా (డోన్ మిన్ అన్హ్) అనే యువతి ఒక రోజు అదృశ్యమవుతుంది. దానిని గ్రామస్తులు ఈ శాపం వల్లే ఆమె మిస్ అయ్యిందని భావిస్తారు. ఆమె అదృశ్యం ఈ ఆత్మ వల్లేనని నమ్ముతారు. కానీ న్గా అత్త మిస్ మూన్ (డిన్ న్గాక్ డియెప్) మాత్రం ఆమె ఇంకా బతికే ఉందని బలంగా నమ్ముతుంది. తను బతికే ఉందని, తనని వేతకడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయంలో గ్రామస్తులు సాయం కోరిన వారు ఆమెను నమ్మరు. ఆమె విషయంలో ఆమెకు ఎవరూ సాయం చేయరు. దీంతో ఆమె ప్రసిద్ధ డిటెక్టివ్ కీన్ (క్వోక్ హుయ్)ని కలిసి తన కోడలిని వేతకాలని కోరుతుంది. దీంతో ఈ కేసును డిటెక్టివ్ కీన్ విచారించేందుకు ముందుకు వస్తాడు
డిటెక్టివ్ కీన్ ఎంట్రీ.. ట్విస్ట్ లే.. ట్విస్టులు
కీన్ ఒక తార్కిక, విశ్లేషణాత్మక డిటెక్టివ్. గతంలో ఎన్నో క్లిష్టమైన కేసులను విజయవంతం పరిష్కరించిన అనుభవం కలిగి ఉంటాడు. న్గా కేసును ఛేదించేందుకు వచ్చిన అతడిని గ్రామస్తులు అనుమానంగా చూస్తారు. అంతేకాదు ఇదంత ఆ ఆత్మ పని అని, ఈ విషయం కలుగజేసుకుంటే నీ ప్రాణాలకే కాదు గ్రామస్తులకు కూడా ప్రమాదమే అని అతడిని హెచ్చరిస్తారు. కానీ కీన్ మాత్రం మూఢనమ్మకాలను తోసిపుచ్చి, ఈ కేసును తన తార్కిక దృష్టికోణంతో పరిశీలిస్తాడు. అతను న్గా అదృశ్యం, తలలు లేని శవాల మధ్య సంబంధం ఉందని భావిస్తాడు. ఈ కేసులో మొండెం లేని శవాల వెనక ఉన్న రహస్యాని ఛేదించే దిశగా విచారణ ప్రారంభిస్తాడు. ఆ శవాలను పరిశీలించిన అతడు ఇది ఆత్మలతో సంబంధం లేదని కనుగోంటాడు. దీనిక వెనక ఓ వ్యక్తి ఉన్నాడని, ఓ హంతకుడు ఉద్దేశపూర్వకంగా ఈ హత్యలు చేస్తున్నాడని నిర్దారిస్తాడు. ఈ శవాలలో ఒకటి న్గాకు సంబంధించినది కాదని తెలుస్తుంది, దీనితో న్గా బతికే ఉండే అవకాశం ఉందని కీన్ భావిస్తాడు.
రొమాన్స్ కూడా మస్త్
ఈ మర్డర్ మిస్టరీ కథలో రొమాంటిక్ యాంగిల్ జోడించాడు దర్శకుడు. ఆ గ్రామానికి చెందిన ఓ అందమైన యువతితో కీన్ ప్రేమలో పడతాడు. ఆమె పేరు తుయేట్. కానీ, ఈ కేసులో కీన్ ఆమెపై అనుమానంతో ఉండటం వల్ల ఆమెపై ఉన్న ప్రేమను గుర్తించలేకపోతాడు. అదే సమయంలో, న్గా గతంలో ఒక యువకుడితో రహస్య ప్రేమ సంబంధం కలిగి ఉందని తెలుస్తుంది, ఇది ఆమె అదృశ్యానికి కారణంగా అయ్యి ఉండోచ్చని అనుమానిస్తాడు. ఉండవచ్చని కీన్ ఊహిస్తాడు. ఈ రొమాంటిక్ ఎలిమెంట్స్ కథకు భావోద్వేగ లోతును జోడిస్తాయి, అదే సమయంలో గ్రామంలో స్త్రీల స్థానం, వారిపై విధించిన సామాజిక ఆంక్షల గురించి సందేశాత్మకమైన వ్యాఖ్యలు చేస్తాడు. అయితే విచారణ ముందు వెల్లెకొద్ది ఊహించని ట్విస్ట్ లు ఎదురవుతుంటాయి. అవి ప్రేక్షకులను మరింత ఆసక్తిని కలిగిస్తాయి. ఒక కీలకమైన ట్విస్ట్‌లో, తుయెట్ న్గాకు సంబంధించిన ఒక రహస్యాన్ని వెల్లడిస్తుంది. న్గా సంబంధించిన ఓ రహస్య లేఖను సంబంధించిన రహస్యాన్ని కీన్ కి చెబుతుంది. ఇది ఇది లియెం క్వాన్ అక్రమ చర్యలను బయటపెడుతుంది. ఇదే ఆమె అదృశ్యం కారణమని గుర్తిస్తాడు. కీన్, మిస్ మూన్ సహాయంతో, న్గాను గుర్తించడానికి సరస్సు ఒడ్డున ఒక రహస్య ప్రదేశాన్ని కనుగొంటాడు, అక్కడ ఆమె బందీగా ఉంటుందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, న్గా ను బయటకు తీసుకురావడానికి కీన్ ఏం చేశాడు? ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎక్కడ చూడాలంటే
వియత్నాంలో ఏప్రిల్ 30, 2025న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం అమెరికా, యూరప్, జపాన్, థాయ్‌లాండ్,మలేషియా వంటి దేశాలలో థియేటర్లో రిలీజైంది. అలాగే ప్రస్తుతం ఆయా దేశాల్లో ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. కానీ, ఇండియన్ ఓటీటీలో మాత్రం అందుబాటులో లేదు. పలు దేశాల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం త్వరలోనే ఇండియన్ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ లు ఈ మూవీ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. త్వరలోనే సదరు సంస్థలు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.