MI Fan Couple: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ టోర్నమెంట్ లో 63వ మ్యాచ్లో భాగం గా ముంబై ఇండియన్స్ (MI ) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ముంబైలోని వాంకాడే స్టేడియం వేదికగా…. ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ అద్భుతంగా రానించి భారీ స్కోరే చేసింది.
Also Read: IPL 2025 Playoffs: IPL మ్యాచులకు ఎక్స్‌ట్రా టైం పెంపు…ఇక రాత్రి 1:15 గంటల వరకు
ముంబై గ్రౌండ్ లో మెరిసిన లవర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో… ఓ అందమైన లవర్స్ జంట స్టేడియంలో మెరిసింది. ఇద్దరూ ముంబై ఇండియన్స్ జెర్సీ వేసుకొని మరి… రచ్చ చేశారు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ తొందరగా అవుట్ కావడంతో…. ఇద్దరు లవర్స్ ఒకరినొకరు చూసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో… ముంబై ఇండియన్స్ అభిమానులతో పాటు ఈ ఇద్దరు లవర్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఒకరినొకరు చూసుకుంటూ ఫీల్ అయిపోయారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్, నమన్ దీర్
ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైతే…. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్ లో 43 బంతులు ఆడిన సూర్య కుమార్ యాదవ్… అయ్ ఏకంగా 73 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు ఏడు బౌండరీలు ఉన్నాయి.
తేలిపోయిన ముంబై బ్యాటర్లు
ఢిల్లీ కాపిల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఇవాల్టి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. రోహిత్ శర్మ ఇవాల్టి మ్యాచ్లో అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. ఐదు బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క బౌండరీ ఉంది. అటు ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ రీకెళ్తాన్ 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విల్ జాక్స్ 13 బంతుల్లో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ 27 బంతుల్లో 27 పరుగులు చేసి వెనుతిరిగాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ అలాగే నమందిరా ఇద్దరూ అద్భుతంగా రాణించారు. దీంతో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది.
Also Read: Rcb-Ms Dhoni: ధోనికి మరో ఘోర అవమానం…స్టంప్స్ నుంచి సిక్సులు అన్ని ఫిక్సింగ్ అంటూ!