BigTV English

DC VS PBKS: RCB బతకాలంటే శ్రేయస్ అయ్యర్ కాపాడాల్సిందే.. లేకపోతే అంతే సంగతులు!

DC VS PBKS:  RCB బతకాలంటే శ్రేయస్ అయ్యర్ కాపాడాల్సిందే.. లేకపోతే అంతే సంగతులు!

DC VS PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో.. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 66వ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కు చాలా కీలకం. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్లో గెలిచిన లేదా ఓడిన ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ పంజాబ్ కింగ్స్ ఇవాల్టి మ్యాచ్లో గెలిస్తే మాత్రం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.


 Also Read: Nitish Kumar Reddy: టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి షాక్….అకౌంట్ హ్యాక్?  

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్


పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్  ( Punjab Kings vs Delhi Capitals ) మధ్య మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో… మొదట పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేయనుంది. జైపూర్ లో మొదట బౌలింగ్ చేసిన జట్టు విజయం సాధించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో టాస్ గెలిచి వెంటనే బౌలింగ్ తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్.

గెలిస్తే నెంబర్ వన్ కు పంజాబ్ కింగ్స్

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య 66వ మ్యాచ్లో… శ్రేయస్ అయ్యర్ టీం గెలిస్తే కీలక పరిణామాలు ఉంటాయి. ప్రస్తుతం 17 పాయింట్లు రెండవ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. ఢిల్లీ పైన విజయం సాధిస్తే నేరుగా మొదటి స్థానానికి… వెళ్లడం జరుగుతుంది. అంటే పంజాబ్ కింగ్స్ చేతిలోకి 19 పాయింట్లు వస్తాయి. 11 సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్ కు చేరిన పంజాబ్ కింగ్స్….. ఇవాల్టి మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో నిలవాలని… భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తనతో పాటు జట్టును కూడా ముందుకు తీసుకు వెళ్తున్నాడు.

అందరూ ప్లేయర్లు కూడా పంజాబ్ కింగ్స్ లో అద్భుతంగా ఆడుతున్నారు. అయితే ఇవాళ గెలిచి మొదటి స్థానానికి వెళ్తే.. పంజాబ్ కింగ్స్ కు మంచి అవకాశం ఉంటుంది. మొదటి స్థానంలో ఉన్న… పంజాబ్ కింగ్స్… కు ఎలిమినేషన్ సమయంలో రెండు ఛాన్సులు ఉంటాయి. కాబట్టి మొదటి స్థానంలో ఉండేందుకే పంజాబ్ కింగ్స్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇవాల్టి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచి.. ముందుకు వెళ్తే.. బెంగళూరుకు భారీ నష్టమే. ఆ జట్టు మళ్లీ నెంబర్ వన్ స్థానానికి రావడానికి.. ఏ మాత్రం ఛాన్స్ ఉండదు. దీంతో బెంగళూరు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

 Also Read: Ban on CSK – RR : 2016, 2017 లో రాజస్థాన్, CSK పై బ్యాన్.. కారణం ధోని కుట్రలేనా?

Delhi Capitals vs Punjab Kings

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్ (c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్ (C ), సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్(w), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×