MI Target Ben Stokes in IPL Auction 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ పైన (Indian Premier League 2027 tournament) ఇప్పటి నుంచి దృష్టి పెడుతోంది ముంబై ఇండియన్స్. గడిచిన రెండు సీజన్లలో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది ముంబై ఇండియన్స్ (Mumbai Indians). ముఖ్యంగా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముంబైలోకి తిరిగి వచ్చిన తర్వాత దరిద్రం తాండవం ఆడింది. అయితే వచ్చే సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యా బయటకు వెళ్ళబోతున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా స్థానంలో మరో కీలక ప్లేయర్ ను తీసుకోవాలని అంబానీ ఫ్యామిలీ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా టెస్ట్ క్రికెట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన బెన్ స్టోక్స్ ను ముంబై ఇండియన్స్ లోకి తీసుకురావాలని అంబానీ ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అతనితో డీలింగ్ కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అన్ని ఓకే అయితే వచ్చే సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ తరఫున బెన్ స్టోక్స్ (Ben Stokes) బరిలోకి దిగుతాడని అంటున్నారు.
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేందుకు బెన్ స్టోక్స్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే సీజన్ లో తన పేరును కూడా నమోదు చేసుకోబోతున్నాడట. ఇలాంటి నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్థానంలో బెన్ స్టోక్స్ ను దక్కించుకునేందుకు అంబానీ ఫ్యామిలీ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బెన్ స్టోక్స్ తో భారీ డీలింగ్ కూడా జరిగినట్లు చెబుతున్నారు. ఈ డీలింగ్ కు బెన్ స్టోక్స్ కూడా ఒప్పుకున్నారట. అంటే వచ్చే సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. అవసరం అనుకుంటే అతడికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇచ్చేందుకు అంబానీ సిద్ధమైనట్లు నేషనల్ మీడియాలో వందనాలు వస్తున్నాయి.
ముంబైలో ఉంటున్న హార్దిక్ పాండ్యా, తన ప్రియురాలు మహికాతో బెంగళూరుకు షిఫ్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 50 కోట్లు పెట్టి బెంగళూరులో ఓ ప్లాట్ కూడా కొనుగోలు చేశాడట హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్ తో బంధం తెగిపోయిన నేపథ్యంలో.. బెంగళూరుకు షిఫ్ట్ అయినట్లు చెబుతున్నారు. అటు ఐపీఎల్ 2027 టోర్నమెంట్ ( IPL 2027) నేపథ్యంలో కేకేఆర్, లేదా చెన్నై తరఫున ఆడనున్నాడట హార్దిక్ పాండ్యా.