Mohammad Waseem: టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Team India vs. Ireland) మధ్య నిన్నటితో టి20 సిరీస్ (India tour of Ireland, 2026) ముగిసిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రెండు టీ20లో కూడా టీమిండియా చిత్తుగా ఓడిపోయి, ఐర్లాండ్ ముందు పళ్ళు రాలగొట్టుకుంది. దీంతో టీమిండియా జట్టుపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. మాజీ క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ వెధవలు కూడా రెచ్చిపోయి, టీమిండియాను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా టీమిండియా ఓటమిపై యూఏఈ మాజీ క్రికెటర్ మహ్మద్ వసీమ్ ( Mohammad Waseem) కూడా కారు కూతలు కూసారు. టీమిండియా కు వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi), మాజీ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( Surya kumaryadav) శాపాలు (curses) తగిలాయని.. అందుకే పసికూన ఐర్లాండ్ జట్ల చేతుల్లో టీమిండియా చిత్తుగా ఓడిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ శాపం ఉన్నన్ని రోజులు టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అంటూ హెచ్చరించారు. దీంతో యూఏఈ మాజీ క్రికెటర్ మహ్మద్ వసీమ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓటమి చెందడం పట్ల సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై యూఏఈ మాజీ క్రికెటర్ మహ్మద్ వసీం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓటమి పాలు కావడం చారిత్రాత్మక తప్పిదమన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల టీమిండియా ఓడిపోయిందని మండిపడ్డారు. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్, వైభవ్ సూర్య వంశీ శాపాలు టీమిండియాను వెంటాడుతున్నాయని వార్నింగ్ ఇచ్చారు. సూర్య లేదా వైభవ్ రెండింటిలో ఏదో ఒక శాపం కారణంగానే ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిందని బాంబు పేల్చాడు మహ్మద్ వసీం.
టీమిండియా మళ్లీ గెలవాలంటే సూర్యకుమార్ యాదవ్ ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదా 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకుంటే ఫలితం బాగుంటుందని వ్యాఖ్యానించారు. అప్పటివరకు టీమిండియా ఇలా ఓడిపోతూనే ఉంటుందని హెచ్చరించారు. దీంతో యూఏఈ మాజీ క్రికెటర్ మహమ్మద్ వసీం చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక మరోవైపు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా ఇదే తరహాలో స్పందిస్తున్నారు. ఐర్లాండ్ టూర్ ను పిక్నిక్ లాగా చూశారని.. అందువల్లే టీం ఇండియా ఓడిపోయిందని షోయబ్ అక్తర్ లాంటి మాజీ క్రికెటర్లు విమర్శలు చేశారు. ఐపీఎల్ జరిగే ఫ్లాట్ పిచ్ లపై తప్పా, టీమిండియా ( Team India Players) ఆటగాళ్లు ఎక్కడా కూడా సరిగ్గా ప్రదర్శన చూపించబోరంటూ ఫైర్ అయ్యారు.