Mohammad Kaif: ఇండియన్ ప్రీమియర్ లీ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 tournament) నేపథ్యంలో ఇప్పటినుంచే ట్రేడింగ్ ప్రక్రియ నడుస్తోంది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్.. మంచి ప్లేయర్ల కోసం వేట మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే తమ పాత కెప్టెన్ రిషబ్ పంత్ ను ( Rishabh Pant)వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. దాదాపుగా అతడు ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వస్తాడని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును విడాలని కెఎల్ రాహుల్ కు సూచనలు చేస్తున్నారు మాజీ క్రికెటర్లు. లేటెస్ట్ గా మహమ్మద్ కైఫ్ కూడా ఇదే వాదన వినిపించారు. వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వదిలి.. కేకేఆర్ జట్టులోకి వెళితే బెటర్ అన్నారు. కేకేఆర్ జట్టుకు సరైన కెప్టెన్ లేడని.. అందులోకి వెళ్తే రాహుల్ ( Kl Rahul) రాత మారుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిశగా అడుగులు వేయాలని మహమ్మద్ కైఫ్ ( Mohammad Kaif) సూచనలు చేశారు. ఈ క్రమంలో మహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఐపీఎల్ 2027 నేపథ్యంలో తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి రిషబ్ పంత్ వస్తాడని వస్తున్న వార్తల నేపథ్యంలో కె ఎల్ రాహుల్ అలర్ట్ గా ఉండాలని మాజీ క్రికెటర్లు సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహమ్మద్ కైఫ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వదిలేసి.. కేకేఆర్ యాజమాన్యంతో డీల్ కుదుర్చుకోవాలని కోరాడు. ఎలాగైనా ఢిల్లీ నుంచి బయటకు వచ్చి, కేకేఆర్ జట్టులోకి రావాలన్నారు. అలా కేకేఆర్ లోకి వస్తే కచ్చితంగా రాహుల్ కు కెప్టెన్సీ రావడం గ్యారెంటీ అన్నారు. అటు కేకేఆర్ యాజమాన్యం కూడా అలర్ట్ అయి… రాహుల్ ను ట్రేడ్ చేయాలని సూచనలు చేశారు మహమ్మద్ కైఫ్.
అలా కాదని ఢిల్లీ క్యాపిటల్స్ లోనే రాహుల్ ఉంటే… అతని తొక్కేస్తారని హెచ్చరించారు. భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా కేకేఆర్ జట్టు కెప్టెన్ గా అజింక్య రహానే ఉన్న సంగతి తెలిసిందే. అతనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. టెస్ట్ కెప్టెన్ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని రాహుల్ సద్వినియోగం చేసుకోవాలని మహమ్మద్ కైఫ్ వెల్లడించారు. ఇది ఇలా ఉండగా వచ్చే సీజన్ నేపథ్యంలో యువరాజు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ గా వ్యవహరించబోతున్నాడు. సౌరవ్ గంగూలీ కూడా జట్టు కోసం పనిచేయబోతున్నాడు. రిషబ్ పంత్ జట్టులోకి రావడమే కాదు, అతనికి కెప్టెన్సీ కూడా ఇస్తారని అంటున్నారు.