E-Paper
Advertisement

మీ వయసు తగ్గించుకోవచ్చు తెలుసా? ఎక్కువకాలం యవ్వనంగా, ఆరోగ్యంగా డాక్టర్ చెప్పిన టిప్స్

మీ వయసు తగ్గించుకోవచ్చు తెలుసా? ఎక్కువకాలం యవ్వనంగా, ఆరోగ్యంగా డాక్టర్ చెప్పిన టిప్స్
Advertisement

ఎక్కువ కాలం జీవించడం మాత్రమే ముఖ్యం కాదు. వయసు పెరిగినా యువ్వనంగా, ఆరోగ్యంగా, చురుకుగా, ఇతరులపై ఆధారపడకుండా జీవించడం కూడా చాలా అవసరం.

వయసు పెరగడం సహజ ప్రక్రియ. అయితే మన రోజువారీ అలవాట్లు, ఆహారం, వ్యాయామం, నిద్ర వంటి అంశాలు శరీరం ఎంత వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్తుందో నిర్ణయిస్తాయి. అందుకే ఇప్పుడు వైద్యులు మనిషి నిజమైన వయసు కంటే బయోలాజికల్ వయసుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. బయోలాజికల్ వయసు అంటే మన శరీరం ఎంత ఆరోగ్యంగా పనిచేస్తుందో తెలిపే సూచిక.

సమస్యలు కనిపించే వరకు వేచి ఉండకండి

Advertisement

చాలా వ్యాధులు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు చూపించవు. ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించినా శరీరంలో కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఊబకాయం, షుగర్ వ్యాధి వైద్య నిపుణురాలు డాక్టర్ విశాఖ శివదాసాని ప్రకారం.. క్రమం తప్పకుండా మెడికల్ టెస్ట్‌లు చేయించుకోవడం చాలా ముఖ్యం. ముందుగానే ఈ పరీక్షలు చేయించుకుంటే వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. దీంతో చికిత్స కూడా సులభంగా ఉంటుంది.

ఫాస్టింగ్ ఇన్సులిన్ పరీక్ష చాలా ముఖ్యం

ఒక్క రక్త పరీక్ష మాత్రమే చేయించుకోవాల్సి వస్తే ఫాస్టింగ్ ఇన్సులిన్ పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా రక్తంలో షుగర్ పెరగకముందే జీవక్రియకు సంబంధించిన సమస్యలను గుర్తించవచ్చు. ముందుగానే తెలుసుకుంటే ఆహారం, వ్యాయామంలో మార్పులు చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలను తగ్గించే అవకాశం ఉంటుంది.

30 ఏళ్ల తర్వాత నడుము కొలతను తప్పకుండా తెలుసుకోండి

Advertisement

శరీర బరువు కంటే నడుము కొలత ఆరోగ్యాన్ని మంచి సూచిక. పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు పేరుకుపోతే ఫ్యాటీ లివర్, టైప్-2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి నడుము కొలతను తరచూ కొలవడం మంచి అలవాటు. దీనివల్ల మీ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని సులభంగా గమనించవచ్చు.

ముడతల కంటే కండరాల బలం ముఖ్యం

చాలామంది వృద్ధాప్యాన్ని ముడతలు లేదా తెల్ల జుట్టుతో గుర్తిస్తారు. కానీ కండరాల బలం తగ్గడం మరింత ముఖ్యమైన సంకేతమని డాక్టర్ విశాఖ సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి. దీంతో శరీర సమతుల్యత, నడక, రోజువారీ పనులు సులభంగా చేయగలుగుతారు.

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి

శరీర కణాల మరమ్మత్తుకు, కండరాల పెరుగుదలకు ప్రోటీన్ చాలా అవసరం. వయసు పెరిగే కొద్దీ కండరాల బలం తగ్గకుండా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. గుడ్లు, చేపలు, పప్పులు, పాల ఉత్పత్తులు, చికెన్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఫుడ్స్ రోజువారీ భోజనంలో తీసుకోవాలి.

Also Read: వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువైందా? పొగ లేకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇలా చేయండి

బయోలాజికల్ వయసును తగ్గించడం సాధ్యమేనా?

వయసు పెరగడాన్ని పూర్తిగా ఆపడం సాధ్యం కాదు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలితో బయోలాజికల్ వయసు పెరిగే వేగాన్ని తగ్గించవచ్చు. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర, ఒత్తిడిని తగ్గించడం, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వంటి అలవాట్లు శరీరాన్ని ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంచుతాయి.

మంచి జీవనశైలితో ఇప్పటి నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే వయసు పెరిగినా చురుకుగా, ఆనందంగా జీవించవచ్చు.

Related News

పిల్లాడిని రోజూ స్కూల్ కోసం రెడీ చేయడం మరింత ఈజీ.. ఉదయం వేళ హడావుడిని తగ్గించే టిప్స్ ఇవిగో

వర్షాకాలం బట్టల లొల్లి.. ఇంట్లోనే బట్టలు ఫాస్ట్‌గా ఆరాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!

అద్దెకు ‘ప్రేయసి’.. ఒక్కో పనికి ఒక్కో రేటు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!

తీవ్ర జ్వరం, శరీరంపై దద్దుర్లు కనిపిస్తున్నాయా? చికెన్ పాక్స్ లక్షణాలు కావచ్చు.. ఇలా తెలుసుకోండి

బాత్రూమ్‌లో చేసే ఈ 7 తప్పులు ఇంట్లో సమస్యలకు కారణం.. ఆర్థిక కష్టాలకు ఆహ్వానం

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. ఈ తేదీల్లో పుట్టినవారు టెన్షన్ తీసుకోరు, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు

ఆఫీస్‌కు వెళ్లే మహిళల కోసం 4 స్టైలిష్ డ్రెస్ ఐడియాలు.. అందరి చూపు మీ పైనే

Big Stories

Advertisement
×