E-Paper
Advertisement

వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ ను ఆడించాల‌ని, గిల్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిందే

వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ ను ఆడించాల‌ని,  గిల్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిందే
Advertisement

Mohammad Kaif On Rohit Sharma: 2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 World Cup ) దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం టీమిండియా కూడా కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ తుది జట్టులో ఉండాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇది అంశంపై మహమ్మద్ కైఫ్ కూడా తాజాగా సంచలన ప్రకటన చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ రోహిత్ శర్మను ఆడించాల్సిందేనని… కెప్టెన్ శుభ‌మాన్ గిల్ ప్రెస్ మీట్ పెట్టాలంటూ హెచ్చరించారు. రోహిత్ శర్మ (Rohit Sharma) ఉంటేనే వన్డే వరల్డ్ కప్ గెలుస్తామని, కెప్టెన్ గా గిల్ చెప్పాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఎంత వీలైతే అంత తొందరగా.. ప్రెస్ మీట్ లో రోహిత్ శర్మ అవసరాన్ని బీసీసీఐకి వివరించాలని సంచలన ప్రకటన చేశారు మహమ్మద్ కైఫ్. దీంతో మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif ) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

వ‌ర‌ల్డ్ క‌ప్ లో కోహ్లీ కంటే రోహిత్ శ‌ర్మ చాలా ముఖ్యం – కైఫ్

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా యాజమాన్యానికి కీలక సూచనలు చేశారు మహమ్మద్ కైఫ్. 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ అవసరం చాలా ఉందని వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా వేదికగా ఈ టోర్నమెంట్ జరుగుతోందని, అక్కడ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని వివరించారు. బౌన్సీ మైదానాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. అవలీలగా సిక్సర్లు కొట్టే రోహిత్ శర్మను తీసుకోవాల్సిందేనని వెల్లడించారు.

2027 వన్డే వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ అవసరం ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అందుకే రోహిత్ శర్మ ఖచ్చితంగా జట్టులో ఉండాలని పేర్కొన్నారు. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి వన్డే వరల్డ్ కప్ గెలిపించే అవకాశాలు ఇవ్వగా ఉన్నాయని కూడా అంచనా వేశారు. వరల్డ్ కప్ నిజంగానే వస్తే ఇద్దరూ ఫైనల్ రోజున రిటైర్మెంట్ ప్రకటిస్తారని గుర్తు చేశారు.

రోహిత్ శర్మ పై గౌతమ్ గంభీర్ కుట్రలు

Advertisement

వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ లో రోహిత్ శర్మ ఆడకుండా గౌతమ్ గంభీర్ కుట్రలు పన్నుతున్నట్లు వస్తున్న వార్తలపై మహమ్మద్ కైఫ్ కూడా స్పందించారు. హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ లాంటి వాళ్లను గౌతమ్ గంభీర్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. అయితే వాళ్లను కాకుండా అనుభవం ఉన్న రోకో కాంబినేషన్ లో గౌతమ్ గంభీర్ తీసుకోవాలని మహమ్మద్ కైఫ్ సూచించారు. అలాగే మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, బుమ్రా ఇలాంటి బౌలర్లను మళ్లీ వన్డే వరల్డ్ కప్ కోసం తీసుకురావాలని డిమాండ్ చేశారు

 

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

Related News

బాబ‌ర్ ఇండియాలో పుట్టింటే, విరాట్ కోహ్లీని మించిపోయేవాడు

పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్

ఐపీఎల్ లో పైస‌లు త‌ప్ప ఏం లేదు…PSLలోనే రియ‌ల్ టాలెంట్

బాబ‌ర్ ఆజం పెద్ద సెల్ఫీష్ ప్లేయ‌ర్…అబ్బాస్, మ‌సూద్ ల‌ను తొక్కేసి మ‌రీ

వైభ‌వ్ త‌ల‌రాత మార్చిన జింబాబ్వే..ర్యాంకింగ్స్ లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్

దిగజారిన మ‌హిళా క్రికెట‌ర్లు..దీప్తి శర్మను గ‌ట్టిగా లాగి ముద్దు పెట్టిన అరుంధతి!

పాకిస్తాన్ ఓడిపోయేలా కుట్ర‌లు..పిచ్ లు మార్చారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

Big Stories

Advertisement
×