Instagram Followers: ఒకప్పుడు హీరోయిన్స్ అంటే సినిమాలకు మాత్రమే పరిమితం ..ఎన్ని సినిమాలు హిట్లయ్యాయి, ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు అన్నదే లెక్క.కానీ ట్రెండు మారింది .ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా.హీరోయిన్స్ పాపులారిటీని లెక్కేయడంలో ఇప్పుడు ఈ సోషల్ మీడియానే ప్రామాణికం.ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో వీళ్ళకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే హీరోయిన్స్ క్రేజ్ లెక్క కట్టేస్తున్నారు .మరి ఇండియాలో టాప్ స్టార్స్ గా వెలుగుందుతున్న ఈ ముద్దుగుమ్మల ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య ఎంత ..ఎవరు టాప్ లో ఉన్నారో ఒకసారి చూసేద్దాం.
ఈ లిస్టులో ఫస్ట్ కనిపించేది ..శ్రద్ధా కపూర్
ఆషికి 2, ఏక్ విలన్, స్త్రీ 2 వంటి సాలిడ్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రద్ధా కపూర్ కి అక్షరాల ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ సంఖ్య 94 మిలియన్లు.ఇండియాలో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఈవిడే ఫస్ట్ ప్లేస్.శ్రద్ధా కపూర్ విషయానికి వస్తే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎలాంటి గ్లామర్ షోలు చేయకుండా కూడా ఈ రేంజ్ లో ఫాలోవర్స్ ఉండడం గమనార్హం.ముఖ్యంగా ఈ అమ్మడు ఇంట్లో వండిన భోజనం, పెట్ డాగ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో కలిసి ఉన్న మూమెంట్స్ సింపుల్ సెల్ఫీ ఫోటోలు ఎక్కువగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం విశేషం.ఒక రకంగా ఆ న్యాచురాలిటీనే ఈ స్థానంలో నిలబెట్టిందని చెప్పవచ్చు.
ప్రియాంక చోప్రా
ఇక ఈ లిస్టులో ఉన్న సెకండ్ సుందరి ప్రియాంక చోప్రా.ఈ గ్లోబల్ స్టార్ కి ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ సంఖ్య అక్షరాలా 93 మిలియన్లు .ఫ్యాషన్, బర్ఫీ ,డాన్ ,మేరీకోమ్ వంటి సూపర్ సక్సెస్ లతో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ తాజాగా వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్ బాట పట్టి అమెరికా కోడలైన ప్రియాంక తన ఇంస్టాగ్రామ్ లో మూవీ అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ లైఫ్, అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ బ్రాండ్ క్యాంపెయిన్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది .
అలియా భట్
ఇక లిస్టులో ఉన్న మూడో ముద్దుగుమ్మ అలియా భట్ .మీ భామకి అక్షరాల 86 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.బ్రహ్మాస్త్ర వంటి సూపర్ సక్సెస్ లతో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అలియాకి చిన్న వయసులోనే ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉండటం గమనార్హం.ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఫ్యాషన్ తో పాటు ఫ్యామిలీ అలాగే మూవీ అప్డేట్స్ తో పాటు మదర్ వుడ్ కి సంబంధించిన పోస్ట్లు పెడుతూ అందరిని ఆకట్టుకుంటుంది .
దీపికా పదుకొనే
ఇక నాలుగో స్థానంలో ఉన్న భామ దీపికా పదుకొనే .అక్షరాల 81 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఈ భామ ఇండియాలో ఉన్న గ్లోబల్ స్టార్స్ లో ఒకరని చెప్పక తప్పదు.చెన్నై ఎక్స్ప్రెస్, హే జవానీ హై దివానీ, జవాన్, కల్కి 2898AD వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ భామ క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్ నుంచి ఆస్కార్ వేదిక దాకా తనదైన గ్లామర్ షో తో మరో లెవెల్ కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
కత్రినా కైఫ్
ఇక ఐదో స్థానంలో ఉన్నభామ కత్రినా కైఫ్.ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, నమస్తే లండన్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ తన బ్యూటీ సీక్రెట్స్,డాన్స్, ఫిట్నెస్,గ్లామర్ వీడియోలతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.
అనుష్క శర్మ
ఇక ఆరో స్థానంలో ఉన్న భామ అనుష్క శర్మ. 69 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించిన అనుష్క శర్మ సినిమాలకి దూరమైనప్పటికీ ఈ స్థాయిలో ఫాలోవర్స్ కంటిన్యూ అవుతుండడం విశేషం.రబ్ నే బనాదీ జోడీ, పీకే ,సుల్తాన్ ,ఎన్ హెచ్ సినిమాలతో సత్తా చాటిన అనుష్క శర్మ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఫిట్నెస్ బ్రాండ్ ప్రమోషన్లతో ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది .
జాక్వెలీన్ ఫెర్నాండెజ్
ఇక ఏడో స్థానంలో బ్యూటీ జాక్వెలీన్ ఫెర్నాండెజ్. 66 మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించిన జాక్వెలీన్ డాన్స్, గ్లామర్ ఫిట్నెస్ వీడియోలతో సోషల్ మీడియాలో సాలిడ్ క్రేజ్ కొట్టేసింది. అలా ఈ భామ పెట్టిన ఏ పోస్ట్ కైనా లక్షలాది లైక్స్ రావడం చాలా కామన్ అయిపొయింది.
దిశా పటాని
ఇక ఎనిమిదో స్థానంలో ఉన్న అందాల భామ దిశా పటాని.సుమారు 61 మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించిన ఈ భామ తన ఇంస్టాగ్రామ్ లో ఫిట్నెస్ వీడియోలను,యాక్షన్ వర్కౌట్స్ ని అలాగే గ్లామరస్ ఫోటోషూట్లని షేర్ చేస్తూ సాలిడ్ ఫ్యాన్ బేస్ కొట్టేసింది.
కృతి సనన్
ఇక తొమ్మిదో స్థానంలో నిలిచిన ముద్దుగుమ్మ కృతి సనన్. అక్షరాలా 59 మిలియన్ల ఫాలోవర్స్ ని కొట్టేసిన ఈ అమ్మడు మిమి,లుకా చుప్పి సినిమాలతో టాప్ లీగ్ లో దూసుకుపోతుంది ముఖ్యంగా ఈ అమ్మడు ఫ్యాషన్, సినిమా అప్డేట్స్ ట్రావెల్ పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటుంది .
రష్మిక
ఇక ఈ లిస్టులో 10వ స్థానం కొట్టేసిన భామ రష్మిక.దాదాపు 51.5 మిలియన్ల ఫాలోవర్స్ తో సౌత్ లో నెంబర్ వన్ ప్లేస్ లో దూసుకుపోతుంది ఈ భామ .ఇక ఇంత క్రేజ్ రావడానికి కారణం పుష్ప 2 , చావా సినిమాలని చెప్పకతప్పదు.
ఇదండీ కోట్లల్లో ఫాలోవర్స్ ని పట్టేసిన సుందరాంగుల జాబితా !
also read :ఏఐ వస్తే నాయకుల ఆట క్లోజ్ అంటున్న ఆర్జీవీ!