Mohammed Siraj : ఇంగ్లాండ్ తో టీమిండియా ప్రస్తుతం తొలి టెస్టు ఆడుతోంది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ చేస్తోంది. మొదటి రోజు 359 పరుగులు చేసింది టీమిండియా. కే.ఎల్. రాహుల్, సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యారు. ఇక రెండో రోజు ఇప్పటివరకు కరుణ్ నాయర్ డకౌట్, జడేజా 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రిషబ్ పంత్ 134 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అలాగే శార్దూల్ ఠాకూర్ 1, బుమ్రా డకౌట్, ప్రసిద్ కృష్ణ 1 పరుగు చేసి ఔట్ అయ్యాడు. మహమద్ సిరాజ్ 3 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో 471 పరుగులకు భారత్ 113 ఓవర్లకి ఆలౌట్ అయింది. రెండో రోజు కూడా మొదటి రోజు మాదిరిగానే బాగానే రాణిస్తుందనుకున్న సమయంలో టీమిండియా ఆటగాళ్లు పటా పట్ ఔట్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చెవిలో ఓ పరికరం పెట్టుకుని ఉన్నాడు. అసలు సిరాజ్ తన చెవిలో పెట్టుకున్న పరికరం ఏంటి..? అనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది. అది రేడియో డ్యూయల్ ట్యూన్ ఇయర్ విగ్.. ఇది రేడియో తరంగాల ఆధారంగా పని చేస్తుంది. ఈ వైర్ లెస్ సాధనాన్ని ఆటగాళ్లు తమ సపోర్ట్ స్టాప్ నుంచి సూచనలు అందుకోవడానికి ఉపయోగిస్తారు. మైదానంలో భారీ క్రౌడ్ సౌండ్ మధ్య లైవ్ కామెంట్రీ స్పష్టంగా వినడానికి వాడతారు. అయితే ప్రస్తుతం ఆ పరికరం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 471 పరుగులకే ఆలౌట్ కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 101, శుబ్ మన్ గిల్ 147, రిషబ్ పంత్ 134 శతకాలతో మెరిశారు. ఆ తరువాత లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో భారత్ త్వరగా ఆలౌట్ అయింది.
చివరి 7 వికెట్లు కేవలం 41 రన్స్ కే కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్ 4, టంగ్ 4, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. నిన్న సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి బ్యాటర్లు లేకుండా టీమిండియా యంగ్ బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారని పొగిడారు. దీనికి తోడు నిన్న కెప్టెన్ గిల్, ఓపెనర్ జైస్వాల్ సెంచరీ చేయడంతో అందరూ అభినందించారు. అలాగే ఇవాళ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీ చేసేంత వరకు టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. ఆ తరువాత 147 పరుగులు చేసిన కెప్టెన్ గిల్ ఔట్ కాగానే వెనువెంటనే వికెట్లు పటాపట్ పడిపోయాయి. దీంతో భారత్ 471 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం. నిన్న 359 పరుగులు చేసిన టీమిండియా ఇవాళ కేవలం అందరూ ఆటగాళ్లు కలిసి 112 పరుగులు మాత్రమే చేశారు. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం.