Cricketers Cars: సాధారణంగా క్రికెటర్ల కార్ల పై అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ వంటి స్టార్ క్రికెటర్లు అంతా కారు కలెక్షన్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఆడి, హమ్మర్ లాంటి ఖరీదైన బ్రాండ్ కార్లను మన క్రికెటర్ల కలక్షన్ లలో ఉన్నాయి. ఏయే క్రికెటర్లు ఏయే కారు వాడుతున్నారో.. ఆ కారు ధర ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read: Rohit Sharma – DRS: ముంబై మ్యాచ్ ఫిక్సింగ్.. అడ్డంగా దొరికిపోయిన రోహిత్.. రాజస్థాన్ ఎలిమినేట్
రోహిత్ శర్మ :
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కు కార్లు అంటే చాలా ఇష్టం. అయితే రోహిత్ శర్మ లగ్జరీ కార్ల సేకరణలో లంబోర్గిని ఉరుస్ ఉంది. ఈ కారును రూ.3.15కోట్ల ఎక్స్ షోరూమ్ ధరతో కొనుగోలు చేశాడు. ఈ SUV 666 గుర్రపు శక్తితో 4 లీటర్ ట్విన్-టర్బో v8 ఇంజిన్ తో వస్తుంది. రోహిత్ శర్మకు మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కారు
విరాట్ కోహ్లీ :
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి లగ్జరీ కార్లున్నాయి. వాటిలో బెంట్లీ కాంటినెంటల్ GT, రేంజ్ రోవర్ వోగ్, ఆడి R8 LMX ఇతర అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ కార్ల కలెక్షన్, బెంట్లీ కాంటినెంటల్ GT, దీని ధర దాదాపు ₹4 కోట్లు.
రేంజ్ రోవర్ వోగ్, విరాట్ తరచూ తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉపయోగించే కారు.
ఆడి R8 LMX:
ఇది ఒక సూపర్‌కార్, దీని ధర ₹2.97 కోట్లు మరియు 5.2-లీటర్ V10 ఇంజిన్‌తో వస్తుంది.
ఇతర ఆడి కార్లు:
విరాట్ ఆడి R8 V10 ప్లస్, A8 L, Q8, Q7, RS5 మరియు S5 లతో కూడిన ఆడి కలెక్షన్‌ను కూడా కలిగి ఉన్నాడు.
లంబోర్గిని అవెంటడార్ ఎస్:
ఇది విరాట్ కార్ల సేకరణలో అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి.
పోర్స్చే:
విరాట్ పోర్స్చే కారును కలిగి ఉన్నాడు, దీని నంబర్ ప్లేట్ “0018”.
బెంట్లీ ఫ్లయింగ్ స్పర్:
విరాట్ కోహ్లీ గ్యారేజీలో ఉన్న మరో అధునాతన కారు బెంట్లీ ఫ్లయింగ్ స్పర్
ఎం.ఎస్. ధోనీ ( Ms Dhoni) :
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీకి కూడా చాలా కార్లు ఉన్నాయి. అందులో కొన్ని ఖరీదు అయినవి. మరికొన్ని విభిన్నమైనవి ఉన్నాయి. ఫెరారీ 599 GTO, హమ్మర్ H2, మెర్సిడెస్ AMGG63 వంటి కార్లు ఉన్నాయి.
సచిన్ టెండూల్కర్ :
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు కూడా లగ్జరీ కార్లు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా లంబోర్గిని ఉరుస్, వోల్వో S80, బిఎండబ్ల్యూ ఐ8, MG ZS EV, BMW 5-సిరీస్, ఆడి Q7, BMWX5M వంటి మోడల్స్ కార్లు కలిగి ఉన్నాడు సచిన్ టెండూల్కర్. ఇవే కాకుండా సారా టెండూల్కర్ మరో కారులో కనిపించడం గమనార్హం.
Also Read: SRH Team Maldives trip : కలసి ఉంటే కలదు సుఖం… తెలుగు హీరో అయిపోయిన ప్యాట్ కమిన్స్
యువరాజ్ సింగ్ :
టీమిండియా మాజీ క్రికెటర్ యువజరాజ్ సింగ్ పలు కార్లను కలిగి ఉన్నాడు. వాటిలో ముఖ్యంగా BMW X7, BMW E46 M3, BMW E60 M5, BMW F86 X6M, BMW F10 M5, లంబోర్ఘిని ముర్సిలాగో ఆడి Q5 ఉన్నాయి. వీరే కాకుండా ఇంకా టీమిండియా క్రికెటర్లలో చాలా మంది లగ్జరీ కార్లను కలిగి ఉండటం విశేషం.