Hyderabad Bangalore highway : హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై మంగళవారం భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద వేస్ట్ కెమికల్ (రసాయన) ట్యాంకర్‌ను మరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో హైవేపై ఇరువైపులా, బెంగళూరు వెళ్లే మార్గంలో, సుమారు 10 కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
READ ALSO: Viral Video: వైజాగ్‌లో భారీ కొండచిలువ.. 12 అడుగుల పామును చూసి జనం బెంబేలు!
సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాలను, రసాయన ట్యాంకర్‌ను క్రేన్ల సహాయంతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బెంగళూరు హైవేపై ప్రయాణించే వారు తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అత్యవసర పనులు ఉన్నవారు, వీలైతే, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.