Big Stories

Nothing Ear (a) @ Rs 282 only: రూ. 282కే నథింగ్ కొత్త ఇయర్‌బడ్స్.. సౌండ్ దద్దరిల్లాల్సిందే!

Get Nothing Bluetooth Ear (a) Ear Buds at Just Rs 282: ఒకప్పుడు కాల్స్ మాట్లాడాలంటే పాకెట్‌లో ఉన్న ఫోన్ తీసి పెద్దగా కేకలు వేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా చేయాల్సిన అవసనం లేదు, ఈజీగా ఇయర్ బడ్స్‌ను మన ఫోన్‌కు కనెక్ట్ చేసి మాట్లాడొచ్చు. ఇప్పుడు స్మార్ట్ ‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు చెవులో ఇయర్ బడ్స్ పెట్టుకోవడం ట్రెండ్‌గా కూడా నడుస్తుంది. టెక్ కంపెనీలు లెటెస్ట్ టెక్నాలజీతో ఇయర్ బడ్స్ తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే లండన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం నథింగ్‌ కొత్త ఇయర్ (ఎ) బడ్స్‌ను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇయర్ బడ్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్ బడ్స్ ధర,ఫీచర్లు తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

నథింగ్ ఇయర్ (ఎ)  అసలు ధర రూ.7,999 కాగా.. లాంచ్ ఆఫర్ కింద మీరు వాటిని రూ. 5,999కి  కొనుగోలు చేయవచ్చు. అలానే నెలకు ఈఎమ్ఐ ద్వారా రూ. 282 చెల్లించి దక్కించుకోవచ్చు. కొన్ని బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఈ ఇయర్‌‌బడ్స్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Also Read: ఈ రోజే రియల్ మీ P1 5G ఫస్ట్ సేల్.. ఈ సారి మాములుగా ఉండదు!

ఈ నథింగ్ ఇయర్ (ఎ) డిజైన్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఇవి ఎల్లో కలర్‌లో బబుల్ డిజైన్‌తో కనిపిస్తాయి.  నథింగ్ ఇయర్ (1) వలే దీనికి ప్రత్యేకమైన 11mm డ్రైవర్ కూడా ఉంది. సౌండ్ క్వాలిటీని మరింత మెరుగుపరచడానికి ఇది ఇయర్ (2) మోడల్ కంటే మెరుగైన డ్యూయల్ ఛాంబర్ డిజైన్‌ కలిగి ఉంది.

నథింగ్ ఇయర్ (ఎ) బడ్స్ క్వాలిటీ మ్యూజిక్‌ను అందిస్తాయి. ఇవి LHDC 5.0, LDAC కోడెక్‌లకు సపోర్ట్ చేస్తాయి. ఇది వైర్‌లెస్ సాంగ్స్ ప్లే చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీ. LHDC 5.0తో ఈ ఇయర్‌‌బడ్స్ 1Mbps 24 bit/192kHz వరకు సౌండ్‌ను క్వాలిటీగా అందిస్తాయి. LDACతో అవి 990kbps, 24 bit/96kHz వరకు బ్లాస్ట్‌ను అందించగలవని కంపెనీ పేర్కొంది. అలానే మీరు “నథింగ్ X” యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ యాప్ సహాయంతో సౌండ్ సెట్టింగ్‌లను చేయవచ్చు. ఈక్వలైజర్‌ని ఉపయోగించవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్, యాక్టివా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా కంట్రోల్ చేయవచ్చు. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. బడ్స్ ప్రత్యేకమైన అడాప్టివ్ ANC ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ స్థాయిని సెట్ చేస్తుంది. ఇది 45dB వరకు నాయిస్ కాన్సిల్ చేయగలదు.

Also Read: మైండ్ బ్లోయింగ్.. జస్ట్ రూ.750కే iQOO 5G ఫోన్!

ఈ ఇయర్‌బడ్స్ కేస్ ఫుల్‌ఛార్జ్ చేస్తే 42.5 గంటల బ్యాకప్ ఉంటుంది. ప్రతి ఇయర్‌బడ్‌లో 46mAh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ కేస్ బ్యాటరీ 500mAhగా ఉంది. అంతేకాకుండి ఈ ఇయర్‌బడ్స్‌ను ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేయవచ్చు. వాల్యూమ్‌ను పెంచడానికి లేదా తగ్గించడానికి పించ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు బడ్స్‌లో ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News