Ind Vs Pak Boycott : ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇవాళ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ పై పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ లో ఇవాళ భారత్, పాక్ మ్యాచ్ నేపథ్యంలో AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రం పై ఫైర్ అయ్యారు. ‘పహల్గాంలో మతం అడిగి 26 మందిని చంపిన పాకిస్తాన్ తో మ్యాచ్ ను తిరస్కరించే అధికారం మీకు లేదా ? రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. ఉగ్రవాదులతో చర్చలుండవని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మరి BCCI ఒక్క మ్యాచ్ కి ఎంత సంపాదిస్తుంది? రూ.2000-3000 కోట్లా? పౌరుల ప్రాణాల కంటే డబ్బే ఎక్కువా? BJP సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Also Read : Chris Lynn : క్రిస్ లిన్ భయంకరమైన బ్యాటింగ్.. ఒకే ఓవర్లో 5 సిక్సులు
పౌరుల ప్రాణాల కంటే డబ్బే ఎక్కువా ? అని ఒవైసీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరోవైపు నిన్న బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ కూడా ఈమ్యాచ్ పై స్పందించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏసీసీ, ఐసీసీ నిర్వహించే మల్టీనేషనల్ టోర్నీల్లో అన్ని దేశాలు పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతాయి. ప్రత్యర్థి జట్టుకు పాయింట్ ఇస్తారు. పాక్ తో భారత్ చాలా ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు. ఇండియా పై పాక్ ఉగ్రవాదదాడులు ఆపే వరకు ఆ నిర్ణయం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహించాల్సిన అవసరం ఏంటి..? అని ప్రశ్నించారు. ఈ మ్యాచ్ జరగకూడదని దేశం మొత్తం చెబుతుంది. అలాంటప్పుడు ఈ మ్యాచ్ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఇది కూడా ట్రంప్ ఒత్తిడితోనే జరుగుతోందా..? అని ప్రశ్నించారు. ట్రంప్ నకు ఇంకా ఎంతవరకు తలవంచుతారు అని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడైనా ఉత్కంఠగా జరుగుతుంది. కానీ ఈసారి అస్సలు మ్యాచ్ నే జరగవద్దని చాలా మంది కోరుకుంటున్నారు. కొంత మంది క్రికెటర్లు, రాజకీయ నాయకులు, అభిమానులు, ముఖ్యంగా పహల్గామ్ లో దాడి మరణించిన వారి భార్య, పిల్లలు, బాధిత కుటుంబాలు ఇలా ఎంతో మంది ఈ మ్యాచ్ జరగడానికి వీలులేదని పేర్కొంటున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కి అనుమతి ఇచ్చింది. భారత ప్రభుత్వం ఒక్క స్టేట్ మెంట్ ఇస్తే.. మ్యాచ్ ఆగిపోతుంది కదా పేర్కొంటున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ మనం ఆడకుండా ఉంటే.. మన దేశం వెనుకంజలో పడుతుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే.. భారత్ పరువు ఉంటుంది. పొరపాటున కూడా పాకిస్తాన్ కనుక గెలిస్తే.. దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ పై టీమిండియా ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా ఆడటం చాలా ముఖ్యం అని స్పష్టంగా అర్థమవుతోంది.
ప్రాణాల కంటే డబ్బే ఎక్కువా? :ఒవైసీ
ఆసియా కప్లో ఇవాళ భారత్, పాక్ మ్యాచ్ నేపథ్యంలో AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంపై ఫైరయ్యారు. 'పహల్గాంలో మతం అడిగి 26 మందిని చంపిన పాక్తో మ్యాచ్ను తిరస్కరించే అధికారం మీకు లేదా? రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. ఉగ్రవాదులతో చర్చలుండవని PM… pic.twitter.com/0o5pvYx5O8
— ChotaNews App (@ChotaNewsApp) September 14, 2025