BigTV English

The Paradise: ‘ ప్యారడైజ్ ‘ లో మోహన్ బాబు.. స్టోరీ లీక్ చేసిన మంచు లక్ష్మీ..

The Paradise: ‘ ప్యారడైజ్ ‘ లో మోహన్ బాబు.. స్టోరీ లీక్ చేసిన మంచు లక్ష్మీ..

The Paradise: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’.. ఇటీవల హిట్ 3 సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నాని ఈ సినిమాతో మరో హిట్ నీ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి అప్డేట్స్ బయటకు వచ్చాయి. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి కూడా.. గతంలో ఎన్నడు లేని విధంగా నాని ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై అంజనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు నానికి సంబంధించిన పోస్టర్లు కొన్ని వీడియోలు రిలీజ్ అయ్యాయి కానీ ఈ సినిమాలో నటిస్తున్న వారి గురించి వెల్లడించలేదు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న మంచు లక్ష్మీ మోహన్ బాబు ఇందులో నటిస్తున్న విషయాన్ని లీక్ చేసింది. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


కీలక పాత్రలో మోహన్ బాబు..

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఫ్యారడైజ్.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో గా కలక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నాడని వార్తలు వినిపించిన విషయం విదితమే. ప్యారడైజ్ లో విలన్ పాత్ర చాలా కీలకమని, అది సీనియర్ హీరోతో చేయించాలని శ్రీకాంత్ ఓదెల భావించి మోహన్ బాబుతో చేయించాలని అనుకున్నారట. దీని గురించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు కానీ ఆయన నటిస్తున్నారని మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మంచు మనోజ్ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న మంచు లక్ష్మి.. ఆ సినిమాలో నటిస్తున్నట్టు కన్ఫామ్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Also Read: అభిమాని టాలెంట్ కు లారెన్స్ ఫిదా.. నోట్ల వర్షం.. వీడియో వైరల్..


ప్యారడైజ్ స్టోరీని లీక్ చేసిన లచ్చక్క.. 

తాజాగా ఓ మూవీ ప్రమోషన్ లో మాట్లాడుతూ.. మా నాన్నగారిని ఏరోజు చూస్తే మనోజ్ కు, నాకు వయస్సు అవుతుందేమో కానీ, ఆయనకు వయస్సు అవ్వడం లేదనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ప్యారడైజ్ సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కు ఫోటోలు తీస్తున్నప్పుడు నాకు చూపించారు. మజిల్స్ కూడిన బాడి తో కొత్త లుక్ ని ట్రై చేస్తున్నారంటూ మంచు లక్ష్మి రివిల్ చేసేసారు.. చాలామంది యాక్టర్స్ సెట్ కు వచ్చి రెండు గంటలు పనిచేసి.. నేను ఇంతకంటే పని చేయను అని చెప్పి.. ఎందుకంటే వారికి హిస్టరీ ఉంది, నేను సీనియర్ ఆర్టిస్ట్ ని అని చెప్తారు. కానీ, నాన్నగారు సెట్ కి వస్తే చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు. నాన్నగారు ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు అని ఈ క్రమంలో నోరు జారేసింది.. దాంతో ఇప్పటివరకు టీం అనూష అని మ్యాటర్ ని మంచు లక్ష్మి లీక్ చేసింది.. దానికి కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ దొరికిపోయింది. మరి దీనిపై నాని టీం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Related News

SSMB 29: కెన్యా షెడ్యూల్ కంప్లీట్.. నెక్స్ట్ ఎక్కడంటే?

Raghava lawrance : అభిమాని టాలెంట్ కు లారెన్స్ ఫిదా.. నోట్ల వర్షం.. వీడియో వైరల్..

Mirai Movie : ‘మిరాయ్’ కు బిగ్ షాక్.. HD క్వాలిటితో ప్రింట్ లీక్..

Kantara Chapter 1 : మానవాతీత శక్తులు నాగ సాధు, మెంటల్ మాస్ స్టోరీ లైన్

Sai Tej : ఆ పసిపాప గురించి మీడియా స్పందిస్తుందేమో అని ఎదురు చూశా, సాయి తేజ్ ఆవేదన

Tg viswa Prasad: నాకు డబ్బులు ఊరికే రాలేదు… మిరాయ్ రిలీజ్ తర్వాత నిర్మాత ఫైర్

Mirai: మిరాయ్ మూవీ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

Big Stories

×