CM Revanth Reddy: 75వ గణతంత్ర దినోత్సవాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షంచుకోవాలన్న చర్చ దేశవ్యాప్తంగా జరగడం దురదృష్టకర మన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆయా నిర్ణయాలు సమాజాన్ని ఆందోళనకు గురి చేయడం జరుగుతోందన్నారు. ఈ విషయంలో మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కేవలం సర్టిఫికెట్లు ఇవ్వడానికి మాత్రం కాదన్నారు. సమున్నత ఆశయంతో దీన్ని ప్రారంభించామన్నారు. ఆనాటి ప్రధాని పీవీ సామాజిక బాధ్యతతో ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. ప్రత్యేకమైన లక్ష్యంతో యూనివర్సిటీని నెలకొల్పారని వివరించారు. నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
రెండు దశాబ్దాలుగా యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. ఈనాడు పాలకులు పేదలకు ఉచితంగా అందించాల్సిన విద్యను దూరం చేశారన్నారు. కార్పొరేట్ విద్యాలయాలను ప్రొత్సహించారని గుర్తు చేశారు. ఒకరకంగా ప్రభుత్వ యూనివర్సిటీ లను నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగిందన్నారు.
మంత్రి వర్గం ఏర్పాటుకు ఎంతైతే ప్రాధాన్యత ఇచ్చామో, తెలంగాణలో యూనివర్సిటీల్లో వీసీలను నియమించడానికి అంతే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వీసీల నియామకంలో సామాజిక న్యాయం కనిపిస్తుందన్నారు. వందేళ్ల పైబడిన ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారి దళిత వర్గానికి చెందినవారిని వీసీగా నియమించడం జరిగిందన్నారు.
ALSO READ: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్‌ను నియమించాలని వీసీలకు సూచించామన్నారు. పదేళ్ల పాటు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని మనసులోని మాట బయటపెట్టారు. రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీలపై కేంద్రం ఆధిపత్యం చేయాలని చూస్తోందన్నారు. దీనికి సంబంధించి నిబంధనలు సడలించేందుకు సిద్ధమవుతోంద న్నారు. విద్యాలయాల మీద ఆదిపత్యం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలను కలుపుకుని పోతామన్నారు.
మేధావులు దీనిపై ఆలోచన చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాల్సిన వీసీలను యూజీసీ నియమిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. విద్యతోపాటు మనపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన యూనివర్సిటీలకు వీసీలను రాష్ట్రపతి నియమిస్తారా? అంటూ ప్రశ్నించారు. కొత్త నిబంధలనపై చర్చ జరగాలన్నారు. అవసరమైతే నిరసనలు తెలపాలన్నారు.
పద్మ అవార్డుల విషయంలో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పట్టించుకోలేదన్నారు. పక్క రాష్ట్రంలో ఐదుగురికి అవార్డులు ఇచ్చారని, దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచాలని ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు.
అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వరేంత్ రెడ్డి ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేశారు. అనంతరం వర్సిటీ ప్రాంగణంలో రావి మెక్కను నాటారు. అలాగే విద్యాలయానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
UGC నిబంధనలు మార్చి విశ్వ విద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలని కేంద్రం కుట్ర పన్నుతోంది: సీఎం రేవంత్ రెడ్డి
ఇది రాజ్యాంగం, రాష్ట్రాలపై దాడి చేయడమే
ఇలాంటి చర్యలు మంచివి కావు, అనవసర వివాదాలకు దారి తీస్తాయి
UGC నిబంధనల మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలని డిమాండ్… pic.twitter.com/HkEaGeUJWo
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2025