Mohammed Siraj: టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ { Mohammed Siraj} ప్రేమలో పడినట్లు సమాచారం. ఈ హైదరాబాది ఓ ప్రముఖ సింగర్ తో డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం ఏంటంటే.. సింగర్ జనై భోస్లే పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు మహమ్మద్ సిరాజ్. తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read: Virat Kohli – RCB: ఇది కదా తెలుగోడి అభిమానం అంటే.. విరాట్ కోహ్లీ కోసం ఏం చేశాడంటే?
ఈ ఫోటోలలో మహమ్మద్ సిరాజ్ ఆమెతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు కనిపించాడు. దీంతో ఈ ఫాస్ట్ బౌలర్ తో సింగర్ బోస్లే డేటింగ్ లో ఉందనే కామెంట్లు గుప్పుమంటున్నాయి. కానీ ఈ రూమర్స్ పై వీరిద్దరూ ఇంతవరకు స్పందించలేదు. జనై బోస్లే.. ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆశా భోస్లే మనవరాలు. 24 ఏళ్ల జనై బోస్లే సింగర్ మాత్రమే కాదు ఓ డాన్సర్ కూడా. ఈమె పది సంవత్సరాల వయసులోనే పాడడం ప్రారంభించింది.
అంతేకాదు ఈమె ఓ యూట్యూబ్ ఛానల్ ని కూడా నడుపుతోంది. జనై తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు మరియు వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సిరాజ్ తో ప్రేమలో పడినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అంతేకాదు వీరిద్దరూ ఒకరినొకరు ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతుండడంతో ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో సిరాజ్ తో పాటు మరో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యారు కూడా పాల్గొన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు జనై బోస్లే కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈమె ది ప్రైడ్ ఆఫ్ భారత్ – చత్రపతి శివాజీ మహారాజ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేయబోతోంది. ఈ సినిమాలో ఆమె చత్రపతి శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి బోన్సాలే పాత్రను పోషించబోతోంది. ఈ మూవీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా 2026 ఫిబ్రవరి 19న విడుదల కాబోతోంది. ఈ సినిమాతో సందీప్ రంగస్థల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
Also Read: Brydon Carse – SRH: టీమిండియాను వణికించిన SRH ప్లేయర్.. ఫుల్ జోష్ లో కావ్యా పాప !
ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో మహమ్మద్ సిరాజ్ కి భారత జట్టులో చోటు దక్కలేదు. డీఎస్పీ సిరాజ్ అటు రంజీ ట్రోఫీలో కూడా పాల్గొనడం లేదు. ఇతడు హైదరాబాద్ తరపున ఆడాల్సి ఉన్నా జనవరి 22 బుధవారం రోజు హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా బరిలోకి దిగలేదు. అయితే బీసీసీఐ మెడికల్ టీమ్ సూచనలతోనే సిరాజ్ ఈ మ్యాచ్ కి దూరంగా ఉన్నట్లు సమాచారం. జనవరి 30న విదర్భతో ప్రారంభమయ్యే రంజీ మ్యాచ్ లో మియా భాయ్ రంగంలోకి దిగబోతున్నాడు.