MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో టీమిండియాను… ఆస్ట్రేలియా కంటే బలంగా తయారుచేసి నిలిపిన కెప్టెన్లలో ధోని ఒకరు. ఆ తర్వాత టీమిండియాతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్టు భయపడేలా జట్టును తయారు చేశాడు ధోని. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతని బ్రాండ్ వ్యాల్యూ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. ప్రస్తుతం 43 బ్రాండ్లకు మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఎక్కువగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మహేంద్రసింగ్ ధోని ఉండడం గమనార్హం. కోహ్లీ అలాగే అనుష్క ఇద్దరు 19 బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే దీనికి తగ్గట్టుగానే… ఆయన ఎక్కడ మ్యాచ్ ఆడినా కూడా జనాలు ఎగబడి చూస్తూ ఉంటారు. ఎలాంటి సోషల్ మీడియా ప్రచారం లేకుండానే… ధోనికి పాపులారిటీ వచ్చింది. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ లాగా ప్రత్యేకంగా సోషల్ మీడియా టీం ను ధోని పెట్టుకోలేదు. రియల్ అభిమానులు ధోనీకి మాత్రమే ఉంటారు. అయితే ఇది క్యాచ్ చేసుకున్న.. పలు కంపెనీలు… ధోనితో… తమ ప్రోడక్ట్లను మార్కెట్లో విక్రయించుకుంటున్నాయి.
చాలా కంపెనీలు తమ తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మహేంద్ర సింగ్ ధోనీని నియామకం చేసుకొని మార్కెట్లోకి వెళ్తున్నాయి. ఫలితాలు మెండుగా రావడంతో… మహేంద్రసింగ్ ధోనికి ప్రోడక్ట్లు కూడా.. బాగానే వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో… గత సంవత్సరం 42 బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ధోని ఈ సంవత్సరం.. ఆ సంఖ్యను 43 పెంచుకున్నాడు. అయితే ఈ లిస్టులో విరాట్ కోహ్లీ వెనుకబడి పోయాడు.
బ్రాండ్ అంబాసిడర్ లిస్టులో ధోని ఖాతాలో 43 ప్రోడక్ట్స్ ఉంటే… విరాట్ కోహ్లీ దంపతులు మాత్రం వెనుకబడి పోయారు. ప్రస్తుత నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీ దంపతులకు కేవలం 19 ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటిని మాత్రమే విరాట్ కోహ్లీ దంపతులు ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత అమితాబచ్చన్ చేతిలో 41 ప్రోడక్ట్ ఉన్నాయి. అతని తర్వాత షారుక్ ఖాన్ 34.. బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
Also Read: Mitchell Starc Retirement: ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ… డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్
MS Dhoni has 43 Brand Endorsements – Highest for a celebrity in India in 2025. [TAM AdEx report]
– DHONI, FACE OF BRANDS…!!!! pic.twitter.com/ShigaFDhP5
— Johns. (@CricCrazyJohns) September 3, 2025