E-Paper
Advertisement

Bigg Boss 8 Day 56 Promo 1: దివాలీ ధమాకా… హౌస్ లో సందడి చేసిన సెలబ్రిటీస్..!

Bigg Boss 8 Day 56 Promo 1: దివాలీ ధమాకా… హౌస్ లో సందడి చేసిన సెలబ్రిటీస్..!
Advertisement

Bigg Boss 8 Day 56 Promo 1.. అక్టోబర్ 31న దీపావళి కావడంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అప్పుడే అసలైన దీపావళి మొదలైంది. తాజాగా 56వ రోజుకు సంబంధించి ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. ఇందులో పలువురు సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేదికపై సందడి చేశారు. సెలబ్రిటీస్ అందరూ వేదికపై కనిపించడంతో కంటెస్టెంట్స్ ముఖంలో ఆనందం వెళ్లి విరిసింది. అంతేకాదు సెలబ్రిటీస్ కంటెస్టెంట్లతో ఆటలు ఆడించి షో ను మరింత సందడిగా మార్చేశారు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

ప్రోమో విషయానికి వస్తే.. అమరన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి, శివ కార్తికేయన్ బిగ్ బాస్ సీజన్ 8లోకి వచ్చారు. ముఖ్యంగా స్టార్ యాక్టర్ సాయి పల్లవి అంటూ ఆమెను సంతోషపరిచారు నాగార్జున. కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ అవినాష్ ను పిలిచి సాయి పల్లవి తో అవినాష్ అను ఫోటో తీసుకొచ్చుకున్నాడు అని చెప్పగానే.. సాయి పల్లవి తన వైఫా అని అడిగింది. ఇంకా తర్వాత నాగార్జున మాట్లాడుతూ.. అమ్మాయిలు కనిపిస్తే వారితో పులిహోర కలిపేటప్పుడు తన భార్య అను ఫోటోని మూసి వేస్తాడు అంటూ అందరినీ నవ్వించారు.

Advertisement

ఇక తర్వాత యాంకర్ అనసూయ కూడా సోగ్గాడే చిన్నినాయన అనే పాటను చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. స్టేజ్ పైకి అనసూయ రాగానే.. ముక్కు అవినాష్ మాట్లాడుతూ. ఐ లవ్ యు అను అని చెప్పాడు. ఇక ఆమె షాక్ లో ఉండగా ఈమె కాదు మా అను అంటూ తెలిపి, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలోని కుర్రాళ్ళు ఈ అనుని విపరీతంగా లవ్ చేస్తున్నారు అంటూ ఆమెను మెప్పించారు. బిగ్ బాస్ హౌస్లో ట్రెజర్ హంట్ గురించి చెబుతూ.. అనసూయ మీకు ఒక హింట్ ఇస్తుంది అని ఆమెకు ఒక కార్డు ఇస్తూ మైధిలిలో చెప్పాలని తెలిపారు నాగార్జున.

దీంతో అనసూయ మాట్లాడుతూ.. మైథిలి లాంగ్వేజ్ మా అత్తగారి లాంగ్వేజ్. నాకు అంత ఫ్లూయంట్ గా రాదు కానీ అర్థమవుతుంది అంటూ తెలిపింది. దీంతో రోహిణి మీ అత్తగారి లాంగ్వేజ్ మీకే రానప్పుడు మాకెట్ల అర్థం అవుతుంది అంటూ అందరినీ నవ్వించింది. దీంతో అనసూయ కూడా రోహిణీ అనిపించుకున్న రోహిణి అంటూ అందరినీ నవ్వించేసింది. ఇక తర్వాత లక్కీ భాస్కర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కూడా విచ్చేశారు. మనిషికి మనీకి మధ్య లవ్ స్టోరీ అంటూ ఈ సినిమా డైరెక్టర్ స్టేజ్ పై తెలిపారు. ఇక తర్వాత క సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం కూడా స్టేజ్ పైకి హీరోయిన్స్ తో వచ్చేశారు. అంతా కూడా కంటెస్టెంట్స్ తో, ఆటపాటలతో చాలా సరదాగా షోని ముగించేశారు. మొత్తానికి అయితే ఈరోజు ఎపిసోడ్ చాలా సందడిగా సాగనుంది అని చెప్పవచ్చు.

Advertisement

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×