Bigg Boss 8 Yashmi Gowda: బిగ్ బాస్ అనే రియాలిటీ షో వల్ల ఎంతోమంది రియాలిటీ బయటపడుతుంది. ముఖ్యంగా వందరోజుల పాటు పెద్దగా పరిచయం లేని వ్యక్తులతో, ఒకే ఇంట్లో ఉండాలి అన్నప్పుడే వారి అసలు స్వరూపాలు బయటపడతాయి. అందుకేనేమో ఇలాంటి రియాలిటీని బయటపెట్టే షోకు బయట చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా ఒక సీరియల్ నటి రియాలిటీ బయటపడింది. దీంతో ఇన్నిరోజుల నుండి తాము అభిమానిస్తుంది తననేనా అని బుల్లితెర ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఇలాగే సాగితే కచ్చితంగా తను తెలుగు బుల్లితెరపై నుండి అన్నీ సర్దుకొని ఇంటికి వెళ్లిపోవాల్సిందే అంటున్నారు.
కన్నడ భామ ఓవరాక్షన్
ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌లో తెలుగు నటీనటుల కంటే కన్నడ నటీనటులే ఎక్కువ. హీరోహీరోయిన్లుగా నటిస్తున్నవారు మాత్రమే కాదు.. సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించేవారిని కూడా కన్నడ ఇండస్ట్రీ నుండే తీసుకొస్తున్నారు మేకర్స్. దానివల్ల ఎన్నో ఏళ్లుగా తెలుగు ఆర్టిస్టులు ఇబ్బందులు పడుతున్నా కూడా పట్టించుకోవడం లేదు. మెల్లగా ప్రేక్షకులకు కూడా కన్నడ మొహాలు అలవాటు అయిపోయాయి. వారి నటనకు ఇంప్రెస్ అయ్యి ఫ్యాన్స్ అవ్వడం కూడా మొదలుపెట్టారు. అలా కన్నడ నుండి వచ్చి తెలుగు బుల్లితెరపై హీరోయిన్‌గా మారిన ఎంతోమందిలో యష్మీ కూడా ఒకరు. ఇన్నాళ్లు ఆన్ స్క్రీన్‌పై తనను చూసి అభిమానించిన ప్రేక్షకులు.. బిగ్ బాస్‌లో చూసి తనపై ద్వేషం పెంచుకుంటున్నారు.
Also Read: మారిన మణికంఠ జాతకం.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు, ఎలిమినేట్ అయ్యేది వాళ్లేనా?
ఇంకెవ్వరూ గెలవద్దు
బిగ్ బాస్ సీజన్ 8లో మొదటివారంలోనే చీఫ్‌గా మారింది యష్మీ. స్మార్ట్‌గా ఆలోచించి బలవంతులను తన టీమ్ సభ్యులుగా సెలక్ట్ చేసుకుంది. ముఖ్యంగా తన టీమ్ సభ్యులు అయిన పృథ్వి, అభయ్ టాస్కుల్లో బాగా ఆడారు. దీంతో నిఖిల్ టీమ్‌లో ఉండాల్సిన సోనియా కూడా తన టీమ్‌లోకే వచ్చేసింది. వీరంతా కలిసి ఒక ‘దండుపాళ్యం’ బ్యాచ్‌లాగా తయారయ్యారని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాస్కుల్లో తాము గెలిస్తే ఒకలాగా, అవతలి టీమ్ గెలిస్తే మరొకలాగా రియాక్ట్ అవుతూ అసలు తాము తప్పా మరెవరు గెలవద్దు అనే రేంజ్‌లో బిల్డప్ ఇస్తూ తిరుగుతోంది యష్మీ. టీమ్ లీడర్‌కు ఉన్న పొగరును టీమ్ సభ్యులు కూడా షేర్ చేసుకుంటూ మిగతా హౌజ్‌మేట్స్‌ను హేళనగా చూడడం మొదలుపెట్టారు.
బ్యాన్ చేస్తున్నారు
న్యాయంగా ఆడకుండా గెలవడంతో పాటు టాస్కుల్లో వైలెన్స్ కచ్చితంగా చేస్తామని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది యష్మీ. తాజాగా జరిగిన ప్రైజ్ మనీ టాస్కుల్లో యష్మీ నిజస్వరూపం పూర్తిగా బయటపడింది. సాక్స్ టాస్క్ ఆడుతున్నప్పుడు తన టీమ్ నుండి అభయ్, పృథ్విని రంగంలోకి దించింది. అంతే కాకుండా సంచాలకురాలిగా కూడా తన టీమ్‌కు చెందిన ప్రేరణనే ఎంపిక చేసింది. ఆ టాస్కులో పృథ్వి ఓడిపోయినా కూడా యష్మీ తనను బయటికి రానివ్వలేదు. అభయ్ వల్ల విష్ణుప్రియా కిందపడినా కూడా తను బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయింది అంటూ అబద్ధాలు ఆడారు. మొత్తానికి అన్యాయం ఆడుతూ గెలుస్తూ రోజురోజుకీ మరింత స్ట్రాంగ్ అవుతున్న యష్మీని చూసి ఇకపై తను నటించే సీరియల్స్‌ను చూడము అంటూ చాలామంది బుల్లితెర ప్రేక్షకులను తనను బ్యాన్ చేసేస్తున్నారు.