Amala Paul Son: అమలాపాల్ (Amala Paul)పరిచయం అవసరం లేని పేరు. ఈమె హీరోయిన్గా సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. కేవలం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగిన అమలాపాల్ ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించాలని చెప్పాలి. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా సక్సెస్ అందుకున్న ఈమె తెలుగులో బెజవాడ అనే సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనంతరం ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు, పిట్టకథలు కుడి ఎడమైతే వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
తమిళ డైరెక్టర్ తో ప్రేమ.. పెళ్లి
ఇలా ఈమె కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే.. అమలాపాల్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దైవ తిరుమగల్ సినిమాలో నటించారు ఈ సినిమా సమయంలోనే డైరెక్టర్ తో ప్రేమలో పడ్డారు. ఇలా కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పాలి. పెళ్లయిన కొద్ది రోజులకు విడాకులు తీసుకుని విడిపోయిన అమలాపాల్ అనంతరం జగత్ దేశాయ్(Jagath Desai) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇలా రెండో పెళ్లి తర్వాత పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన అమలాపాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తూ సందడి చేశారు.
క్యూట్ గా ఉన్న ఇలై..
ఇకపోతే పెళ్లయిన కొద్ది నెలలకే ఈమె తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించారు. ఈ చిన్నారికి ఇలై(Ilai) అనే నామకరణం చేశారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె ఎప్పటికప్పుడు తన కొడుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు తాజాగా తన కొడుకుతో ఉన్నటువంటి కొన్ని క్యూట్ ఫోటోలను షేర్ చేయగా ఇది కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె కుమారుడిని చూసినా అభిమానులు వామ్మో అప్పుడే ఇంత పెద్దగా అయ్యాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అమలాపాల్ కుమారుడు చూడటానికి చాలా ముద్దుగా ఉన్నారని చెప్పాలి.
ప్రస్తుతం ఈమె తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక సెలబ్రిటీలు పలు బ్రాండ్లతో కొలాబరేట్ అవుతూ వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈమె చిన్నపిల్లల దుస్తులకు ప్రసిద్ధి చెందిన ఓ సంస్థతో కోలాబరేట్ కావడంతో ప్రమోషన్లలో భాగంగా ఇలా తన కొడుకు ఫోటోలను కూడా షేర్ చేశారని తెలుస్తోంది. ఇక అమలాపాల్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగినప్పటికీ గతంలో పెద్ద ఎత్తున వివాదాలలో కూడా చిక్కుకున్నారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఈమె గతంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు అదేవిధంగా, టాక్స్ ఎగ్గొట్టడంతో పోలీసులు ఈమెను 2018 సంవత్సరంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Also Read: బాలీవుడ్ హీరోతో అడ్డంగా దొరికిపోయిన శ్రీ లీల.. రిలేషన్ కన్ఫర్మ్ చేసినట్టేనా?