BigTV English

MS Dhoni : మాల్దీవులు వద్దు.. లక్ష ద్వీప్ ముద్దు.. వైరల్ అవుతున్న ధోని వ్యాఖ్యలు

MS Dhoni : మాల్దీవులు వద్దు.. లక్ష ద్వీప్ ముద్దు..  వైరల్ అవుతున్న ధోని వ్యాఖ్యలు
MS Dhoni latest comments

MS Dhoni latest comments(Sports news headlines):


భారతదేశం-మాల్దీవుల మధ్య రేగిన చిచ్చు, అక్కడ దేశంలో ముగ్గురు మంత్రుల  సస్పెన్షన్  వరకు వెళ్లింది. అంతేకాదు భారతదేశంలో నిప్పులా రాజుకుంది. ఇప్పుడందరూ చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు మాల్దీవులు వద్దు…లక్షద్వీప్ ముద్దు అంటున్నారు.

మన దేశంలో సుందరమైన ప్రదేశాలను చూసిన తర్వాతే.. విదేశాల్లో పర్యటిస్తామని ఒక  వీడియోలో ఎప్పుడో మాజీ కెప్టెన్ ధోనీ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అది సందర్భానుసారంగా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.అందులో తన భార్య సాక్షి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టమని, కెరీర్ అయిన తర్వాత ముందు భారతదేశమంతా తిరగాలని ఉందని అందులో తెలిపాడు..


ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ వెళ్లారు. అక్కడ అనంతమైన ప్రకృతి సౌందర్యాన్ని చూసి మైమరిచారు. లక్షద్వీప్ ను పర్యాటక స్వర్గధామంలా మార్చాలని భారత ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇది చూసిన చాలామంది నెటిజన్లు ఏం చేశారంటే, కుదురుగా ఉండకుండా లక్షద్వీప్ ని మాల్దీవులతో పోల్చారు. ఇక్కడే నిప్పు రాజుకుంది. మాల్దీవుల మంత్రి షియూనా భారతదేశంలో ప్రజలు నీట్ గా ఉండరు. వారికి సామాజిక స్ప్రహ తక్కువ. ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తుంటారని విమర్శించారు. ఈ మాటలకి మరో ఇద్దరు మంత్రులు మజీద్, మల్షా  తమ మద్దతు తెలిపారు.

దీంతో వీరి వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరో అక్షయ కుమార్ స్పందించాడు. నా దేశ ప్రజలను అవమానించిన మాల్దీవులకి ఇక వెళ్లనని ఒట్టు పెట్టాడు. నా ఓటు లక్షద్వీప్ కేనని తెలిపాడు. నా షూటింగులన్నీ ఇక్కడే పెట్టుకుంటానని చెప్పాడు. అంతేకాదు ఎక్స్ ప్లోర్ ఇండియన్ ఐలాండ్స్ అని ఒక ట్యాగ్ తగిలించాడు. 

ఇందుకు సపోర్టుగా చాలామంది సినీహీరోలు, సెలబ్రిటీలు, మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనాతో సహా పలువురు, ఇంకా బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ లాంటి వాళ్లు అందరూ జయహో భారత్ అన్నారు.

మహ్మద్ షమీ కూడా స్పందించాడు. భారతదేశంలో పర్యాటకానికే ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నాడు. దీంతో ‘బాయ్ కాట్ మాల్దీవుస్’ అనే హాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. దీంతో టూరిజం మీదే ఆధారపడి జీవించే మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ధోనీ ఆనాడెప్పుడో చెప్పిన మాటలను ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకొచ్చా

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×