BigTV English

TSPSC : కొత్త పాలక మండలి ఏర్పాటుపై సర్కార్ ఫోకస్.. TSPSC ఛైర్మన్ ఎంపికపై కసరత్తు..

TSPSC :  కొత్త పాలక మండలి ఏర్పాటుపై సర్కార్ ఫోకస్..  TSPSC ఛైర్మన్ ఎంపికపై కసరత్తు..
breaking news in telangana

TSPSC Latest News(Breaking news in telangana):

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, కమిటీ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త పాలక మండలి ఏర్పాటుపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే TSPSC ఛైర్మన్, కమిటీ సభ్యుల నియామకంపై సీఎం రేవంత్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే రాజకీయాలకు అతీతంగా ఉన్న టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, కమిటీ సభ్యుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉన్నా వారికే ఛైర్మన్ బాధ్యతలు ఇచ్చేందుకు సర్కారు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అందుతుంది.


62 సంవత్సరాల వయస్సు వయో పరిమితి గల వారిని మాత్రమే ఛైర్మన్ గా తీసుకునేందుకు చట్టంలో పరిమితి ఉంది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారిని ఛైర్మన్ గా నియమించేందుకు ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. తొలుత అకునూరి మురళిని నియమించేందుకు ఓకే అనుకున్నప్పటికీ వయోపరిమితి దాటడంతో ప్రత్యమ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు సమాచారం. దాంతో అన్ని యూనివర్సీటిల్లో ఉన్నా ప్రొఫెసర్లపై సీఎం రేవంత్ దృషి పెట్టారని తెలుస్తోంది. అలానే ఛైర్మన్ నియమకానికి ఏర్పాట్లు జరుగుతుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మరోవైపు గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఆ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు ఆయన లేఖ కూడా రాశారు. ఇప్పుడు తాజాగా వారి రాజీనామాలను గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు.


గత ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్సీలో చోటు చేసుకున్న ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పరపతి ఒక్కసారిగా దిగజారింది. ఈ నేపథ్యంలోనే ఛైర్మన్‌ను, సభ్యులను మార్చాలంటూ నిరుద్యోగులు ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు క్రమంగా పరిస్థితులు సద్దుమణగడంతో పరీక్షల నిర్వహణకు కాంగ్రెస్ సర్కారు సిద్ధం అవుతోంది.

.

.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×