MS Dhoni : భారత క్రికెట్ కి సరికొత్త నిర్వచనం ఇచ్చిన లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పుడు తన సొంత రాష్ట్రం జార్ఖండ్ కి సరికొత్త దిశా నిర్దేశం చేయడానికి సిద్ధం అయ్యారు. క్రీడలు, పర్యాటక రంగాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధోనీ సలహాలు, సహకారం తీసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ధోనీ జార్ఖండ్ మహిళ క్రికెటర్లతో తాజాగా ఫోటో దిగాడు. వాళ్లకు కొన్ని సూచనలు కూడా చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోనీ సూచనలు పాటిస్తే.. జార్ఖండ్ జట్టు విజయంతంగా తయారు అవుతుందని ప్రభుత్వం భావించినట్టు సమాచారం.
Also Read : Sheila Singh : సాక్షి తల్లి చేతిలో 800 కోట్ల బిజినెస్… ధోని అత్తగారి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా !
జార్ఖండ్ ప్రభుత్వానికి ధోనీ సహకారం..
కేవలం క్రికెట్ పై మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ గవర్నెన్స్ వంటి అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఉపయోగిస్తూ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. జార్ఖండ్ తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ ను పూర్తిగా మార్చబోతున్నాయి. జార్ఖండ్ క్రీడలు, పర్యాటక రంగాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మాజీ భారత క్రికెట్ కెప్టెన్ ధోనీ సహకారం కోరుతుంది. ఈ విషయం పై ధోనీ.. ఆ రాష్ట్ర పర్యాటక కళలు, సంస్కృతి క్రీడా శాఖ మంత్రి సుదివ్యకుమార్ తో భేటీ అయ్యారు. క్రీడా మౌలిక సదుపాయాలు, పర్యాటక సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. ధోనీ అనుభవం, నిబద్ధతతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆధ్యాత్మిక చింతనలో
ఇటీవలే ధోనీ రాంఛీ కి సమీపంలో ఉన్న దేవరీ మందిర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. రాంచీ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్యూరీ అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారికి 16 చేతులుంటాయి. 700 సంవత్సరాల పురాతనమైనది ఈ ఆలయం. ఇక్కడ గిరిజన పూజారులు, బ్రాహ్మణులు ఇద్దరూ కలిసి పూజలు నిర్వహించడం విశేషం. ధోనీ ప్రధాన టోర్నమెంట్ల కి ముందు గతంలో ఈ ఆలయాన్ని చాలా సార్లు సందర్శించి విజయాన్ని సాధించాడు. ఇదే నమ్మకంతో ఈ సారి కొడుకు పుట్టాలని ధోనీ కుటుంబ సభ్యులతో రహస్యంగా పూజలు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన ధోనీ ఐపీఎల్ మాత్రం ఆడుతున్నాడు. 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయాల కారణంగా దూరమైతే.. ధోనీ కెప్టెన్ గా వ్యవహరించాడు. కానీ CSK పేలవ ప్రదర్శన కనబరిచింది. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీ.. ఐపీఎల్ ముగిసిన వెంటనే తన ఇంటికి వెళ్లి బైకు రైండింగ్ చేస్తుంటాడు. అలాగే వ్యవసాయం కూడా చేస్తాడు. ఈ రెండింటితో పాటు ఫ్యామిలీతో కలిసి అప్పుడప్పుడు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతుంటాడు.