BigTV English

MI -Rohit Sharma: ప్రమాదంలో ముంబై…చేసిందంతా రోహిత్ శర్మనే ?

MI -Rohit Sharma: ప్రమాదంలో ముంబై…చేసిందంతా రోహిత్ శర్మనే ?

MI -Rohit Sharma:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ( ( 2025 Indian Premier League )) సంబంధించిన అన్ని కార్యక్రమాలు చక చకా నడుస్తున్నాయి. మార్చి నెల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే… 2025 కు సంబంధించిన మెగా వేలం కూడా పూర్తి అయింది. దాదాపు అన్ని జట్లకు తమ ప్లేయర్లను… కొనుగోలు చేసి పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఇతర జట్లతో పోలిస్తే ముంబై ఇండియన్స్ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.


Also Read: ICC World Test Championship: WTCకి చేరిన దక్షిణాఫ్రికా… మరి టీమిండియా పరిస్థితి ఏంటి.. లెక్కలు ఇవే?

జెడ్డా వేదికగా జరిగిన మెగా వేలంలో ముంబై యాజమాన్యం మ్యాచ్ విన్నర్లనే తమ జట్టులోకి తీసుకుంది. జట్టును ఒకసారి గమనిస్తే విధ్వంసకరమైన బ్యాటర్లు, బలమైన బౌలింగ్ లైనప్ తో పాటు ఆల్ రౌండర్లతో నిండి ఉంది. అయితే ఆ జట్టులో ఉన్న అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు ఫామ్ లో లేకపోవడం ఆందోళనను కల్పించింది. ముంబై ఇండియన్స్ ని ఐదుసార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ శర్మ  ( Rohit Sharma) గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నారు.


మొన్న టెస్ట్ మ్యాచ్ కు దూరమైన రోహిత్ శర్మ ( Rohit Sharma) ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్ లలో పాల్గొన్నాడు. ఈ ఐదు ఇన్నింగ్స్ లలో రోహిత్ శర్మ కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తానికే హిట్ మ్యాన్ అంతర్జాతీయ స్థాయిలో టి20 ఫార్మాట్ లో ఆడడం లేదు. ఈ సంవత్సరం జరిగిన టి20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే వచ్చే ఐపీఎల్ లో రోహిత్ టీ20 లైన్ ను అందుకోవడం అంత సులభమైన పని కాదని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు.

ఇప్పటికే పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ  ( Rohit Sharma) టెస్టుల్లోనూ పెద్దగా రాణించడం లేదు. దీంతో రాబోయే సీజన్ రోహిత్ శర్మ ఏ విధంగా బౌలర్లను ఎదుర్కొంటాడు అని యాజమాన్యం టెన్షన్ పడుతోంది. నిజానికి టి20 ఆడని ఒక ఆటగాడు ఐపీఎల్ లో ( Indian Premier League ) పరుగులు చేయడం అంత సులభం కాదు. ఇది కాకా రోహిత్ పరుగులు చేసిన చేయకపోయినా ప్లేయింగ్ ఏలేవెన్ నుంచి అతనిని తొలగించడం చాలా కష్టం. పైగా ముంబై ఇండియన్స్ కు ( Mumbai Indians) హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ గత సంవత్సరం దారుణంగా ఓడిపోయింది. టోర్నీ నుంచి వైదొలిగిన మొదటి జట్టుగా విమర్శలు ఎదుర్కొంది. దీనిని దాటుకొని వచ్చే సీజన్లో బలంగా పుంజుకోవాలని భావిస్తున్న ముంబై ఇండియన్స్ ను రోహిత్ శర్మ  ( Rohit Sharma) ఫామ్ కలవరపెడుతోంది.

Aslo Read: Nitish Kumar Reddy: నితీష్ కుమార్ రెడ్డి కులంపై రచ్చ.. అసలు రెడ్డి కాదంటూ..!

Related News

Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మ‌రోసారి రుజువైంది..చేతులారా వ‌చ్చిన రనౌట్ వ‌దిలేశారుగా

India vs Pakistan final: టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్స్‌… 41 ఏళ్లలో తొలిసారి…రికార్డులు ఇవే..ఫ్రీగా చూడాలంటే?

IND vs SL: నేడు శ్రీలంక‌తో మ్యాచ్‌…టీమిండియాకు మంచి ప్రాక్టీస్…బ‌లాబ‌లాలు ఇవే

Rohith Sharma : మ‌రోసారి 10 కిలోలు తగ్గిన రోహిత్ శ‌ర్మ‌…ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×