BigTV English

ICC World Test Championship: WTCకి చేరిన దక్షిణాఫ్రికా… మరి టీమిండియా పరిస్థితి ఏంటి.. లెక్కలు ఇవే?

ICC World Test Championship: WTCకి చేరిన దక్షిణాఫ్రికా… మరి టీమిండియా పరిస్థితి ఏంటి.. లెక్కలు ఇవే?

ICC World Test Championship: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ కోసం అన్ని జట్లు తలపడుతున్నాయి. ముఖ్యంగా టాప్ 3 లో ఉన్న టీమిండియా, ఆస్ట్రేలియా అలాగే దక్షిణాఫ్రికా మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే టీమిండియా అలాగే ఆస్ట్రేలియా జట్లకు షాక్ ఇచ్చిన దక్షిణాఫ్రికా…. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా పాకిస్తాన్ జట్టును మట్టి కరిపించిన దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెళ్ళింది.


Aslo Read: Nitish Kumar Reddy: నితీష్ కుమార్ రెడ్డి కులంపై రచ్చ.. అసలు రెడ్డి కాదంటూ..!

మొన్నటి వరకే దక్షిణాఫ్రికా ఖచ్చితంగా క్వాలిఫై అవుతుందని ప్రచారం జరిగింది. మొదటి స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఇవాళ అధికారికంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు క్వాలిఫై అయింది. దీంతో టీమిండియా అలాగే ఆస్ట్రేలియా 2, 3 స్థానాలను దక్కించుకున్నాయి. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ లో…. పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది సౌత్ ఆఫ్రికా.


 

మొదటి టెస్టులో రెండు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది దక్షిణ ఆఫ్రికా. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠంగా జరిగింది. ఈ మ్యాచ్ లో 50 కి పైగా పరుగులు చేసిన నేపథ్యంలో నాలుగు వికెట్లు తొందరగా కోల్పోయింది సౌత్ ఆఫ్రికా. అయితే అలాంటి సమయంలో జట్టును ఆదుకున్నారు రబాడ అలాగే జాన్సన్. మ్యాచ్ చివర్లో రబాడ 31 పరుగులు అలాగే జాన్సన్ 16 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. ఇక ఈ మ్యాచ్ విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెళ్ళింది సౌత్ ఆఫ్రికా. అంటే రెండవ స్థానంలో ప్రస్తుతం అయితే ఆస్ట్రేలియా ఉంది.

 

ప్రస్తుతం ఆస్ట్రేలియా 58.89 విన్నింగ్ పర్సంటేజ్ తో దూసుకు వెళ్తోంది. ఆ తర్వాత మూడో స్థానంలో టీమిండియా ఉంది. 55.89 విన్నింగ్ పర్సంటేజ్ తో టీం ఇండియా మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక… టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ కొనసాగుతోంది. చివరగా ఐదవ టెస్ట్ కూడా ఈ రెండు జట్ల మధ్య ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ల్లో కూడా టీమిండియా గెలిస్తే… తప్పకుండా డబ్బులు తీసి ఫైనల్ కు వెళుతుంది. ఒకవేళ నాల్గవ మ్యాచ్ డ్రా అయితే…. ఐదవ టెస్ట్ కచ్చితంగా గెలవాల్సిందే.

 

అలా గెలిచినా కూడా ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మధ్య టోర్నమెంట్ ఉంది. అక్కడ ఆస్ట్రేలియా దారుణంగా ఓడిపోవాలి. అప్పుడు టీమిండియా కు ఛాన్స్ ఉంటుంది. ఇక ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మిగిలిన రెండు టెస్టులు కూడా డ్రా అయితే కూడా టీమిండియా కు ప్రమాదమే. ఎందుకంటే శ్రీలంక పైన కచ్చితంగా గెలిచే ఛాన్సులు ఎక్కువ. అందుకే టీమిండియా చేతిలో ఒకే ఒక అస్త్రం ఉంది. 4 అలాగే 5వ టెస్ట్ కచ్చితంగా గెలవాల్సిందే. అప్పుడే డబ్ల్యూటీసి ఫైనల్ కు వెళ్లి దక్షిణాఫ్రికా తో తలపడనుంది.

Also Read: Nitish Kumar Reddy father: గవాస్కర్ కాళ్ళు మొక్కిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×