Jasprit Bumrah: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా అంతర్జాతీయ క్రికెట్ లో అరుదైన రికార్డ్ ని నమోదు చేశాడు. టెస్టుల్లో 200 వికెట్ల క్లబ్ లో చేరాడు బూమ్రా. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావీస్ హెడ్ వికెట్ పడగొట్టి {Jasprit Bumrah} ఈ అరుదైన రికార్డుని సాధించాడు. టెస్టుల్లో 20 కంటే తక్కువ సగటుతో (19.38) తో 200 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్ గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.
Aslo Read: ICC World Test Championship: WTCకి చేరిన దక్షిణాఫ్రికా… మరి టీమిండియా పరిస్థితి ఏంటి.. లెక్కలు ఇవే?
అంతేకాదు భారత్ తరపున అత్యంత వేగంగా (బంతుల పరంగా) 200 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. దీంతో కపిల్ దేవ్ 32 ఏళ్ల రికార్డుని బూమ్రా బద్దలుకొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ 37 ఇన్నింగ్స్ లలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు బూమ్రా {Jasprit Bumrah} 44 వ టెస్టులో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రికార్డుని సమం చేస్తూ ఈ మైలురాయిని చేరుకున్నాడు. తన అద్భుతమైన బంతులతో ఆతిధ్య బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు బూమ్రా. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో {Jasprit Bumrah} ఇప్పటికే 26 వికెట్లు పడగొట్టాడు.
దీంతో ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా {Jasprit Bumrah} నిలిచాడు. ఇదే ఆస్ట్రేలియా గడ్డపై 1991 – 92 లో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 25 వికెట్లు పడగొట్టాడు కపిల్ దేవ్. పది ఇన్నింగ్స్ లలో బౌలింగ్ చేసి ఈ ఘనత సాధించాడు. 2018 – 19 సీజన్ లోనే బూమ్రా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొత్తం 21 వికెట్లు పడగొట్టాడు. అప్పుడు కపిల్ దేవ్ రికార్డుని బ్రేక్ చేయలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం ఆ రికార్డుని బ్రేక్ చేసి కొత్త చరిత్ర సృష్టించాడు.
అంతేకాదు ఈ సిరీస్ లో {Jasprit Bumrah} తన వికెట్ల సంఖ్యను మరింత పెంచుకునే అవకాశం ఉంది. ఇక 200 వికెట్ల మార్క్ ని సాధించిన జాబితాలో పాకిస్తాన్ మాజీ పేసర్ యూనిస్ 7,725 బంతులలో తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టేయిన్ 7,848 బంతులలో రెండవ స్థానంలో, కగీసో రబాడ 8,153 మూడవ స్థానంలో ఉన్నారు.
Also Read: Pro Kabaddi League 2024 Final: నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ మ్యాచ్..ఎప్పుడు, ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?
మ్యాచ్ ల పరంగా భారత స్పిన్నర్ రవిచంద్రన్ 37 మ్యాచ్ లతో భారత్ తరఫున ముందున్నాడు. ఇక {Jasprit Bumrah} బూమ్రా 8,484 వంతులలో 200 వికెట్లు తీసి నాలుగవ స్థానంలో నిలిచాడు. భారత్ తరుపున అత్యంత వేగంగా 200 వికెట్ల క్లబ్ లో చేరిన బౌలర్లలోనూ బూమ్రా మొదటి స్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో షమీ, మూడవ స్థానంలో అశ్విన్, నల్గొవ స్థానంలో కపిల్ దేవ్, ఐదవ స్థానంలో రవీంద్ర జడేజా నిలిచారు.