BigTV English

Mushfiqar Rahim : అలా బాల్ పట్టుకున్నాడు..ఇలా చెత్త రికార్డ్ నమోదు చేశాడు

Mushfiqar Rahim : అలా బాల్ పట్టుకున్నాడు..ఇలా చెత్త రికార్డ్ నమోదు చేశాడు
Mushfiqar Rahim

Mushfiqar Rahim : న్యూజిలాండ్-బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఘటన


న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య మిర్పూర్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ లో అనూహ్యంగా ఓటమి పాలైన కివీస్ పట్టుదలతో ఆడుతోంది.

బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 41 ఓవర్ లో ఒక ఘటన జరిగింది.
కివీస్ బౌలర్ జేమిసన్ వేసిన బంతిని ముష్ఫికర్ రహీమ్ డిఫెన్స్ ఆడాడు. అయితే అది అనూహ్యంగా బౌన్స్ అయ్యి వికెట్ల మీదకు దూసుకొచ్చింది. దాన్ని మనోడు తెలివిగా చేత్తో చేపపిల్లను పట్టినట్టు పట్టి అవతలికి విసిరేశాడు.


అయితే బంతిని ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నా్డనే కారణంతో న్యూజిలాండ్ ప్లేయర్లు ఔట్ కోసం అప్పీల్ చేశారు. అంపైర్లు సంప్రదించుకుని.. థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రీప్లేలో బంతిని ముష్ఫికర్ కావాలనే అడ్డుకున్నట్లు  తేలింది. ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ నింబంధన కింద ముష్ఫికర్ రహీమ్‌ను ఔటైనట్లు ప్రకటించారు. ఇలా అవుటైన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్ గా ఒక చెత్త రికార్డు నమోదు చేసుకుని నిరాశగా పెవిలియన్ వైపు కదిలాడు.

జనరల్ గా చాలామంది బ్యాటర్లు డిఫెన్స్ ఆడిన తర్వాత అక్కడే బాల్ ఉంటే, బ్యాట్ తోనే పక్కకు జరపడం, లేదంటే చేత్తో తీసి ఫీల్డర్లకి ఇవ్వడం చేస్తుంటాడు. కాకపోతే అప్పటికది డెడ్ బాల్ కింద అయిపోయిన తర్వాతే చేస్తారు. అయితే ఇక్కడ మ్యాచ్ లో ఆ బాల్ ఇంకా డెడ్ కాలేదు. డిఫెన్స్ ఆడిన తర్వాత కూడా రైజ్ అయ్యింది. అంటే బంతి లైవ్ లోనే ఉంది, అంటే బతికే ఉందని లెక్కేసి అవుట్ ఇచ్చేశారు.

‘ఇది కాలం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్’ అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ లో మ్యాథ్యూస్ టైమ్డ్ అవుట్ వివాదం ఎంత రచ్చ అయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పుడు బంగ్లాదేశ్ ఏమన్నాదంటే, మేం నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని సమర్థించుకుంది.

ఇప్పుడవే నిబంధనలు తిరిగి బంగ్లాదేశ్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాయని, క్రీజులో సెట్ అయ్యే టైమ్ కి అవుట్ అయ్యాడని, అందుకనే చెరపకురా చెడేవు అని ఊరికినే అనరు కదా…అని కూడా అంటున్నారు. టైమ్డ్ అవుట్ వివాదంలా మాత్రం కివీస్ ని ఎవరూ కించపరచడం లేదు. అసలైన ఆటంటే అదేనని, న్యాయంగానే అడిగారని నెటిజన్లు కివీస్ ని సమర్థిస్తున్నారు.

ఈ జాబితాలో భారతజట్టు మాజీ ఆటగాడు మొహిందర్ అమర్‌నాథ్ కూడా ఉండటం విశేషం. 1989లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఇలా రన్ అవుట్ అవుతున్నప్పుడు బాల్ వికెట్ల మీదకి వస్తుంటే కాలితో పక్కకి తన్నేశాడు. దీంతో అసాధారణ రీతిలో అవుట్ అయిన ఆటగాడిగా తను కూడా చరిత్రలో చెత్త రికార్డుతో నిలిచిపోయాడు. అందుకనే ఇప్పటికి తలచుకుంటున్నామని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related News

5 Balls Won Match: 5 బంతుల్లో ముగిసిన మ్యాచ్…7 గురు డకౌట్… 23 పరుగులకే ఆలౌట్

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Big Stories

×