Gundeninda GudiGantalu Today episode February 4th: నిన్నటి ఎపిసోడ్ లో… రవికి బలవంతంగా బాలు చపాతీలు తినిపించడంపై మీనా బాధపడుతుంది. లోపలికి వెళ్లి ఏడుస్తూ ఉంటే బాలు ఏమైంది ఏడుస్తున్నావు తాగింది నేనే తే నువ్వు ఎందుకు ఏడవాలి అనేసి అడుగుతాడు. దానికి మేన మీరు తాగిస్తారు ఉదయం లేవగానే అంతా మర్చిపోయి అందరితో బాగుంటారు కానీ అందరూ అన్న మాటలు నన్నే కదా చూశారా అంతకుముందు రోహిణి ముందు నన్ను ఎలా అన్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడలు శృతి ముందు కూడా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. తాగుబోతు పెళ్లామని నన్ను తిడుతున్నారు ఆమాత్రం మీరు కనిపించలేదా? మీ అమ్మగారు అన్న మాటలు కే నేను భరించలేకపోతున్నాను. కొత్తగా వచ్చిన అమ్మాయి చేత కూడా నన్ను అనిపిస్తారా మీకు కొంచమైనా న్యాయంగా ఉందా అసలు నేను ఏ తప్పు చేశాను మీరు ఇంతకన్నా తాగొచ్చి అందరి చేత మాటలు పడి తాగుబోతు పెళ్లామని నన్ను కూడా మాటలు పడేలా చేస్తున్నారు కదా అని బాధపడుతుంది. ఇక ఉదయం లేవగానే శృతికి మీనా కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. ఇక రోహిణి కూడా కాఫీ కావాలని అడుగుతుంది. ముగ్గురు కాఫీ కూర్చొని తాగుతూ ఉంటారు. సరదాగా తమ భర్తల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు సరదాగా ఉండడం చూసి ప్రభావతి కుళ్ళుకుంటుంది. కోడలు అంటే బయటకు వెళ్తారు మీనాకేం పని పాట లేదు కదా ఇంటి పని చేయాలి కదా అలా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంది చూసారా అని కుళ్ళుకుంటుంది. ప్రభావతి ముగ్గురు కోడలు ఇలాగే ఉండాలని కోరుకున్నాను ఇలానే ఉన్నారని సత్యం అంటారు. ఇక మీనా దగ్గరికి వచ్చి కాఫీ కావాలి అని అడిగితే శృతి ఉండి మేము ముగ్గురం మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరే వెళ్లి కాఫీ పెట్టుకోండి అని షాక్. ఇక శోభన వచ్చి పచ్చని సంసారం లో చిచ్చుపెడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తన కూతురుకు నగలు పెడుతున్న అనే వంకతో ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తుంది శోభా.. కానీ నగలను చూసి ప్రభావతి తెగ మురిసిపోతూ ఉంటుంది. మీనా, రోహిణీ ఇలా అంతా అక్కడే ఉంటారు. అప్పుడు కావాలనే శోభన.. మా శ్రుతికి మేము ఇంత గొప్పగా ఇచ్చాం కదా.. మరి మీ రెండో కోడలు ఎంత తెచ్చిందో? అంటుంది వెటకారంగా. దాంతో ప్రభావతి మరింత వెటకారంగా.. మేమే ఎదురు ఇవ్వాల్సి వచ్చింది.. ఎందుకంటే వాళ్ల స్థాయి అంతే కదా.. అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది. అందరి ముందు తనను తక్కువ చేసి మాట్లాడుతుంది. దానికి మీనా బాధపడుతుంది. ప్రభావతి అనేదే కాకుండా బయట వాళ్ళతో కూడా అనిపిస్తుందా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ప్రభావతి అన్న మాటలకు బాధపడుతూ మీనా బయటికి వెళ్లి కూర్చుని ఏడుస్తుంది. ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చున్నావా ఇంట్లో పని ఎవరు చేస్తారు అనేసి అంటుంది. ఏడుస్తున్న నిన్ను చూడ్డానికి వచ్చారా లేదా పనిచేయడానికి తీసుకెళ్లామని వచ్చారా అని నేను అడుగుతుంది. ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అని ప్రభావతి అనగానే మీనా నేను పని చేయడానికి మాత్రమే పనికొస్తానా నాకు ఇంకా మీరు నోరు జారిన అని క్షమాపణ చెప్తారేమో అని అనుకున్నాను అని బాధపడుతుంది.
నేను తప్పు మాట్లాడను ఉన్న మాటే కదా అన్నాను దానికి నువ్వు వింతగా ఏడవాలా ఇదేదో బాగానే ఉంది అనేసి ప్రభావతి మళ్లీ మీనా పై నిందలు వేస్తుంది. మీ నాన్న కనీసం ఇసుమంత బంగారైనా నీకు ఇచ్చాడా ఏ దానికి గతిలేకే కదా మేము దయతలచి నిన్ను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చామని ప్రభావతి అనగానే మీనా ఆపండి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. ఏం తప్పు చేసారు ఉన్న వాళ్ల గురించి మాట్లాడుతున్నారు పడుతున్నాను లేని వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీకు అని మీనా ప్రభావతిపై రివర్స్ అవుతుంది.. ఏంటి నోరులేస్తుంది ఏమైంది నీకు అనేసి ప్రభావతి అనగానే ఇంట్లోని వాళ్ళందరూ అక్కడికి వస్తారు. శృతిలిద్దరూ ప్రభావతి తప్పు చేసింది అని మీనాను బాధ పెట్టారని అంటారు. రోహిణి కూడా మీనాన్న ఎందుకు అత్తయ్య బాధపెట్టారని అంటుంది. అప్పుడే సత్యము అక్కడికి వస్తాడు. ఏమైందమ్మా మీనా ఎందుకు బాధపడుతున్నావ్ అని అంటే ఏమన్నారు మీకు అర్థం కావట్లేదు మావయ్య మీరు వినలేదా అత్తయ్య ఎన్ని మాటలు వేరేవాళ్ళం ముందర నన్ను అన్ని మాటలు అంటుంటే ఎలా బాధపడకుండా ఉంటాను మావయ్య.. లేని వాళ్ళ గురించి మాట్లాడటం తప్పు కదా మామయ్య అని మీనా బాధపడుతుంది. ఇక దానికి ప్రభావతి నీ నాటకాలు ఇక చాలు ఆపు అనేసి అనగానే ఎందుకు ఆపాలి నన్ను ఎందుకు అంటారు అసలు అని మీనా తిరగబడుతుంది.
నేను అన్నానని అంటున్నారే నేను అన్న దాంట్లో తప్పేంటి నీ ఒంటి మీద ఉన్న ప్రతి బంగారు మేం చేయించిందే అనేసి అనగానే మీనా ఒక్క నిమిషం ఆగండి అని ఆ బంగారం మొత్తం తీసుకువచ్చి ప్రభావతిస్తుంది. అప్పుడే బాలు ఇంట్లోకి వస్తాడు. ఏమైంది మీనా ఏడుస్తుంది అని అడుగుతాడు. ఇప్పుడు నేను ఇంత కోపంగా మాట్లాడుతుంది ఏంటని సత్యం అని అడిగితే మీ అమ్మ నోటికి హద్దు లేదు కదా అందుకే మీనా బాధపడుతుంది రా అనేసి అంటాడు. ఇక మీనా మాట్లాడుతుంటే ఏం నాటకాలు ఆడుతున్నావే నీ ఒంటి మీద ఉన్న బంగారంతో కొలిచి ఇచ్చినట్టు మాట్లాడుతున్నవే నీ మెడలో ఉన్న తాళిబొట్టు కూడా మేము చేయించిందే అని అనగానే అనుకున్నాను అత్తయ్య మీరు అది కూడా అడుగుతారని అందుకే తీసుకొచ్చాను అని తాళిబొట్టు చూపిస్తుంది దానికి సత్యం బాలుతో పాటు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. మా పేరింటికి గుర్తుగా నేను పసుపు కొమ్ము కట్టుకున్నాను మీరేం భయపడకండి మావయ్య అని మీనా అంటుంది.. ఇక బాలు ప్రభావతి మధ్య మరో యుద్ధం మొదలవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మీనా ప్రభావతికి రివర్స్ అవుతుంది ఇక బాలు కూడా మీనాకు సపోర్ట్ చేస్తాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.