BigTV English

NAM Vs SCO Highlights: అదరగొట్టిన స్కాట్లాండ్.. నమీబియా పై ఘన విజయం

NAM Vs SCO Highlights: అదరగొట్టిన స్కాట్లాండ్.. నమీబియా పై ఘన విజయం
T20 World Cup 2024 12th Match – Namibia Vs Scotland Highlights: టీ 20 ప్రపంచకప్ లో రెండు చిన్న జట్లయిన స్కాట్లాండ్ వర్సెస్ నమీబియా మధ్య జరిగిన పోటీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఎట్టకేలకు స్కాట్లాండ్ విజయం సాధించి ముందడుగు వేసింది.

వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన నమీబియా మొదట బ్యాటింగ్ తీసుకుంది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.


156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్కాట్లాండ్ కి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ జార్జ్ (7) వెంటనే అయిపోయాడు. మరో ఓపెనర్ మిచెల్ జోన్స్ 20 బంతుల్లో 1 సిక్స్, 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అనంతరం ఫస్ట్ డౌన్ వచ్చిన బ్రాండన్ (17) పెద్దగా ఆకట్టుకోలేదు.

Also Read: India vs Pakistan T20 Match: తీవ్ర ఒత్తిడిలో పాకిస్తాన్.. భారత్‌కు పోటీ ఇస్తుందా?


ఈ పరిస్థితుల్లో కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ బాధ్యతలను తీసుకున్నాడు. మరోవైపు మిచెల్ లెస్క్ సహాయంతో  ఆకాశమే హద్దుగా చెలరేగాడు.35 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్ల సాయంతో 47 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టుని విజయపథంలో నిలిపాడు. మిచెల్ లెస్క్ 17 బంతుల్లో 35 పరుగులు చేసి స్కోరుబోర్డుని పరుగులెత్తించి లక్ష్యం ముందు అవుట్ అయ్యాడు.  మొత్తానికి  18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసిన స్కాట్లాండ్… విజయ దుందుభి మోగించింది.

నమీబియా బౌలింగులో రూబెన్ 1, తంగేని లుంగమేని 1, బెమర్డ్ 1, కెప్టెన్ ఎరాస్మస్ 2 వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన నమీబియాకు శుభారంభం దక్కలేదు. ఖాతా తెరవకముందే వికెట్ కోల్పోయింది. అలా వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. ఒక దశలో ఆ జట్టు 7.4 ఓవర్లలో 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి విలవిల్లాడింది. కాకపోతే కెప్టెన్ ఎరాస్మస్ 31 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి, జట్టు స్కోరుని పరుగులెత్తించి అవుట్ అయ్యాడు.

Also Read: ఆనందంలో ఉగండా.. విషాదంలో పపువా న్యూగినీ

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్ జేన్ గ్రీన్‌తో కలిసి ఎరాస్మస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయిదో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే కాసేపటికే వికెట్ కోల్పోయాడు. తర్వాత జానే గ్రీన్ (28) కాసేపు కెప్టెన్ కి సపోర్ట్ చేశాడు. డేవిడ్ (14), జేజే స్మిత్ (11) తప్ప మిగిలినవారు సరిగా ఆడలేదు. మొత్తానికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి నమీబియా 155 పరుగులు చేసింది.

స్కాట్లాండ్ బౌలింగులో బ్రాడ్ వీల్ 3, బ్రాడ్లీ 2, క్రిస్ సోల్ 1, క్రిస్ గ్రీవ్స్ 1, మిచిల్ లీస్క్ 1 వికెట్లు పడగొట్టారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×