Elderly Farmer Hardship| రైతుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని, వారి స్వాలంబనే లక్ష్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే గొప్పలు చెబుతుంటాయి. కానీ సోషల్ మీడియాలో హృదయం కలిచి వేసి ఒక వైరల్ వీడియో.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. లాతూర్ జిల్లాలోని హడోల్టి గ్రామంలో 75 ఏళ్ల రైతు అంబదాస్ పవార్, తన భార్య శాంతాబాయితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. భూమిని దున్నడానికి ఎద్దుల స్థానంలో తానే కాడిని మోస్తూ కష్టపడుతున్నాడు. వెనుక నుంచి అతని భార్య పొలం దున్నడంలో అతడికి సాయం చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియో రైతుల బాధలను, ప్రభుత్వ వాగ్దానాల నీడలోని నిజాలను బయటపెట్టింది.
రైతుల దీనస్థితి
అంబదాస్ పవార్‌కు 2.5 ఎకరాల భూమి ఉంది. కానీ, ఎద్దులు కొనే శక్తి లేదు, ట్రాక్టర్ అద్దెకు తీసుకోవడం కూడా సాధ్యం కాదు. కూలీలను నియమించడానికి కూడా డబ్బులు లేవు. దీంతో, అతను తన భార్య శాంతాబాయితో కలిసి స్వయంగా కాడిని మోస్తూ భూమిని దున్నుతున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు వారి దీనిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అత్యధిక రైతులున్న మహారాష్ట్రలో జులై 1న వ్యవసాయ దినోత్సవం ఘనంగా జరిగింది. అయితే, ఈ వీడియో రైతుల నిజమైన దీనస్థితిని చూపిస్తోంది.
రైతుల కష్టాలు
అంబదాస్ పవార్ మాట్లాడుతూ.. “మా కుటుంబం కోసం, జీవనోపాధి కోసం ఇలా చేయక తప్పడం లేదు. కూలీల ఖర్చు ఎక్కువైంది. ట్రాక్టర్‌తో విత్తనాలు వేయడం మాకు అందుబాటులో లేదు. ఎద్దులు కొనే స్థోమత లేదు. వ్యవసాయంలో పెట్టిన డబ్బు కంటే తక్కువ ఆదాయం వస్తోంది,” అని చెప్పారు. వారు బ్యాంకు నుండి ₹40,000 రుణం తీసుకున్నారు, దాన్ని ప్రతి సంవత్సరం తిరిగి చెల్లించి, మళ్లీ తీసుకుంటున్నారు.
సోయాబీన్ సంచులు ₹4,000కి అమ్మితే.. 25 కిలోల సోయాబీన్ విత్తనాల సంచి ₹3,000. ఎరువుల ధరలు ₹1,200–₹1,500 వరకు పెరిగాయి. అంటూ వ్యవసాయం ద్వారా వచ్చే తక్కువ ఆదాయంతోనే వారు జీవనం సాగిస్తున్నారు.
శాంతాబాయి విజ్ఞప్తి
శాంతాబాయి ప్రభుత్వాన్ని రుణ మాఫీ చేయమని వేడుకున్నారు. “మాకు ఐదు ఎకరాల భూమి ఉంది, కానీ నీటిపారుదల సౌకర్యం లేదు. మా కొడుకు పూణేలో జీవనం సాగిస్తున్నాడు. అతను చదువుకోలేదు, అందుకే ఈ కష్టాలు పడుతున్నాం. మా మనవళ్లు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోకూడదని కోరుకుంటున్నాం. మేము చేతులు, కాళ్లు ఉపయోగించగలిగినంత వరకు పొలంలో పని చేస్తాం. ప్రభుత్వం మా రుణాలను మాఫీ చేసి, ఎరువులు, విత్తనాలు అందించాలని కోరుతున్నాం,” అని అన్నారు.
Also Read: 45 ఏళ్లైనా పెళ్లికాలేదు.. స్వామీజీకి కష్టం చెప్పుకున్నాడు.. ఇంతలోనే శవమై
రైతుల సమస్యలు
మహారాష్ట్రలో వ్యవసాయం మీద లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. కానీ.. కరువు, అధిక వర్షాలు, అప్పుల భారం, మార్కెట్‌లో అస్థిరత, ప్రభుత్వ సహాయం లేకపోవడం వల్ల రైతుల జీవితాలు ఎల్లప్పుడూ ప్రమాదంలో ఉన్నాయి. ఈ పరిస్థితి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. రైతుల సామాజిక, ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో పడింది. ఈ సంక్షోభం మూల కారణాన్ని గుర్తించి, శాశ్వత పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు అత్యవసరంగా మారింది.
Maharashtra: No Money For Bullocks Or Tractor, 65-Year-Old Latur Farmer Ties Himself To Plough.#maharashtra #Farmer #Latur #FPJ pic.twitter.com/gEolaUqMVz
— Free Press Journal (@fpjindia) July 1, 2025