Gill – NKR : ఇంగ్లాండ్ తో ప్రస్తుతం టీమిండియా మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇవాళ లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా ఫీల్డింగ్ చేస్తోంది. అయితే గత రెండు మ్యాచ్ ల్లో కూడా ఇంగ్లాండ్ టాస్ బ్యాటింగ్ ఎంచుకోలేదు. రెండో టెస్టులో ఓడిపోవడంతో మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకోవడం విశేషం. మూడో టెస్టులో ‘బాగుందిరా మామా..’ డైలాగ్ వైరల్ అయింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డిని తెలుగులో ప్రశంసించాడు కెప్టెన్ శుభమన్ గిల్. ఇక బౌలింగ్ స్పెల్ అద్భుతంగా వేసి, రెండు వికెట్లు తీసిన నితీశ్ ఈ క్రమంలో నితీశ్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు ఇంగ్లాండ్ బ్యాటర్లు.
కొత్త కుర్రాడికి కెప్టెన్సీ..
ఈ క్రమంలో ఓ బాల్ అద్భుతంగా స్వింగ్ అయినప్పుడు నితీశ్ బౌలింగ్‌ను బాగుందిరా మామ అంటూ అభినందించాడు టీమిండియా కెప్టెన్ గిల్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. గిల్ ఇవాళ కొత్త కుర్రాడికి కెప్టెన్సీ ఇచ్చారనే చెప్పాలి. ఈ కుర్రాడు ఇంగ్లాండ్ పై తన జోరు చూపిస్తాడా..? అని గిల్ పై కొంత మంది డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు. సెంచరీల మీద సెంచరీలు చేసి మంచి ఫామ్ లో కొనసాగుతున్న గిల్.. కెప్టెన్సీ విషయంలో కూడా టాలెంట్ చూపిస్తూనే ఉన్నాడు. అయితే స్లెడ్జింగ్ విషయంలో తాను ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్టు క్లియర్ చేసేశాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ల ను గిల్ చేసిన ర్యాగింగ్ చూస్తే మీకే స్పష్టంగా అర్థమవుతుంది.
బజ్.. బజ్ బాల్..
వాస్తవానికి ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ గురించి గత కొద్ది సంవత్సరాలుగా మాట్లాడుతున్నప్పుడూ బజ్ బాల్ అనే పేరు తెగ ఉపయోగించారు. అంటే ఏంటి..? అని అడిగితే.. టెస్ట్ క్రికెట్ లో దూకుడు పెంచారు అని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తుంటారు. తాజాగా ఇవాళ ఆ పదం వినిపించలేదు. కానీ మ్యాచ్ చాలా స్లో గా సాగుతున్న సమయంలో ఇంగ్లాండ్ రన్ రేట్ మూడు దగ్గర ఉండటంతో.. దీంతో బజ్ బాల్ ఎక్కడికీ పోయింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ చాలా బోరింగ్ గా సాగుతుందని కామెంట్స్ చేశారు. టీమిండియా ప్లేయర్లకు కూడా అలాగే అనిపించింది. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చురకలు అంటించారు. బంతి బాగా స్వింగ్ అవుతుండటంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. దీంతో కెప్టెన్ శుబ్ మన్ గిల్ వెల్ కమ్ బ్యాక్ టూ బోరింగ్ టెస్ట్ క్రికెట్ అని కామెంట్స్ చేశాడు. స్టంప్ మైక్ లో వినిపించింది. బజ్ బజ్ బజ్ బాల్.. నేను బజ్ బాల్ చూడాలి అంటూ సిరాజ్ కవ్వించే ప్రయత్నం చేశాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భారత్ vs ఇంగ్లాండ్ మూడో టెస్టులో 'బాగుందిరా మామా..' డైలాగ్ వైరల్
లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డిని తెలుగులో ప్రశంసించిన కెప్టెన్ శుభమన్ గిల్
బౌలింగ్ స్పెల్ అద్భుతంగా వేసి, రెండు వికెట్లు తీసిన నితీశ్
ఈ క్రమంలో నితీశ్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు… pic.twitter.com/0juOL8PnAw
— BIG TV Breaking News (@bigtvtelugu) July 10, 2025