BigTV English

Pakistan: పాక్‌ ప్రధానిపై ఒత్తిడి.. ప్రతీకారం తప్పదు.. ఆ దేశ ప్రజలను ఉద్దేశించి

Pakistan: పాక్‌ ప్రధానిపై ఒత్తిడి.. ప్రతీకారం తప్పదు.. ఆ దేశ ప్రజలను ఉద్దేశించి

Pakistan: ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’పై రగిలిపోతోంది దాయాది దేశం పాకిస్తాన్. ఆ దేశ ప్రజలతోపాటు పలు ఉగ్రవాద సంస్థల నుంచి అక్కడి ప్రభుత్వం, సైన్యంపై ఒత్తిడి తీవ్రమైంది. పరిస్థితి గమనించిన ఆ దేశ ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు, ఆర్మీ, నేవీ, వైమానిక విభాగాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.


ఏదో ఒకటి చేయకుంటే నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని వారితో ప్రధాని అన్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలిగేందుకు ఆదేశ ప్రజలను ఉద్దేశించి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మాట్లాడారు. భారత్‌పై ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.

ఆదేశ ప్రజలను ఉద్దేశించి ఏమాట్లాడారు?


ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ కొన్ని రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోపే ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బుధవారం రాత్రి తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు ప్రకటన చేశారు. ఎలా దీటుగా సమాధానం ఇవ్వాలో తమ దేశానికి, బలగాలకు తెలుసని చెప్పారు. పాక్‌ బలగాలకు దేశం అండగా ఉంటుందన్నారు.

మనం వెనక్కి తగ్గుతున్నామని భారత్ అనుకుంటుందని, ఇది ధైర్యవంతుల దేశమని మరచిపోకూడదని వ్యాఖ్యానించారు. మా సాయుధ దళాలు ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. పాకిస్తాన్ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుంద న్నారు. పాకిస్తాన్ ప్రజల భద్రత కోసం సైన్యం, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అసలు ఉగ్రవాదం ద్వారా పాకిస్తాన్ ఎక్కువగా ప్రభావితమవు తుందన్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి సాయుధ దళాలకు అధికారం ఉందన్నారు.  శత్రువులపై పోరాడి విజయం సాధిస్తామని తెలియజేశారు.

ALSO READ: పాకిస్తాన్‌లో దర్జాగా తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు, ఇక వారికి మూడినట్టే?

ప్రధాని ప్రసంగానికి ముందు

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఉగ్రవాద క్యాంపులపై పెద్దఎత్తున దాడులు జరగడంతో ఉగ్రవాదులు, వారి కుటంబసభ్యులు చనిపోయారు.  ఆయా వర్గాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రమైంది. దీంతో భారత్‌పై ఎలాంటి దాడులు చేయాలన్న దానిపై పాకిస్తాన్ ఎటు తేల్చుకోలేకపోతోంది. యుద్ధం వస్తే పాకిస్తాన్ సర్వనాశనం అవుతుందని భావించి ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు ఆదేశ జాతీయ భద్రతా సలహాదారు, ఆర్మీ, నేవీ, వైమానిక అధిపతులతో ప్రధాని షెహబాజ్ భేటీ అయినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఏదో ఒకటి చేయాలని ఆ సమావేశంలో ప్రధాని చెప్పినట్టు తెలుస్తోంది. మనం నేరుగా ఆదేశంపై యుద్ధం  చేయలేమని అన్నారు.  కేవలం ఉగ్రవాదుల స్థాపరాలను చూపించి భారత్ తమ భూబాగంపై దాడులు చేసిందని చెప్పుకొచ్చారట.

భారత్ చేసిన దాడులపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది దాయాది దేశం పాకిస్తాన్. ఆదేశ విమానాలపై భారత్ దాడి చేసిందని వివిధ దేశాలను నమ్మించే ప్రయత్నం చేసింది. భారత దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సైన్యం వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. పాకిస్తాన్ మీడియా పాత వీడియోలు, ఫోటోలను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని విస్తరించే పనిలో నిమగ్నమైంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్‌లోని పలు ప్రాంతాలలో బుధవారం రాత్రి భారత్ దాడి చేసింది. ఈ ఘటనలో 31 మంది పౌరులు మరణించారని ఆదేశ సైన్యం చెబుతోంది. మరో 46 మంది గాయపడినట్టు తెలిపింది.

Related News

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Indian Army: అమెరికా చెప్పేదొకటి, చేసేదొకటి.. ట్రంప్ తీరుని ఎండగట్టిన ఇండియన్ ఆర్మీ

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Big Stories

×