Waitlisted Ticket Upgrade: ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కలిగించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెయిటిల్ లిస్ట్ టికెట్ ఆటోమేటిక్ గా అప్ గ్రేడ్ చేయబడుతుందని వెల్లడించింది. ప్రయాణీకులు బుక్ చేసుకున్న క్లాస్ లో సీటు అందుబాటులో లేకపోయినప్పటికీ, పై తరగతిలో సీటు అందుబాటులో ఉంటే ఆటో మేటిక్ గా ఆ సీటు కేటాయించబడుతుందని తెలిపింది. అయితే, ఈ అప్ గ్రేడ్ గరిష్టంగా రెండు స్థాయిలకు పరిమితం చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు రైల్వే బోర్డు మే 13 న సర్య్యులర్ జారీ చేసింది.
ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా అప్ గ్రేడ్
నిజానికి ఈ రూల్ 2006 నుంచి అందుబాటులో ఉంది. అయితే, గతంలో టికెట్ ఆప్ గ్రేడ్ అయిన తర్వాత అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా పై తరగతికి అప్ గ్రేడ్ చేసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం 2S నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 3E, 3A, 2A, 1A వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నియమానికి ఒక మినహాయింపు ఉంటుంది. 2A టికెట్ హోల్డర్ మాత్రమే 1A కి అప్‌గ్రేడ్ అవ్వడానికి అర్హత ఉంటుంది. సిట్టింగ్ వసతిలో ఇది 2S నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత VS, CC, EC, EV, EAకి అప్ డేట్ అవుతుంది. సిట్టింగ్ లో స్లీపింగ్ వసతిలో CC టికెట్ హోల్డర్ మాత్రమే EC, EV, EAకి అప్ గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. పూర్తి ఛార్జీ చెల్లించే ప్రయాణీకులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారని ఇండియన్ రైల్వే ప్రకటించింది. లోయర్ బెర్త్ ప్రయాణీకులు, సీనియర్ సిటిజన్లకు కూడా అప్ గ్రేడేషన్ కు అర్హులు. కానీ, అప్ గ్రేడేషన్ తర్వాత వారికి లోయర్ బెర్త్ లభిస్తుందనే గ్యారెంటీ లేదు. తాజాగా తీసుకొచ్చిన రూల్స్ అమలు అయ్యేలా సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను రైల్వే బోర్డు అదేశించింది.
మే 1 నుంచి కొత్త రూల్స్ అమలు
మే 1 నుంచి భారతీయ రైల్వే సంస్థ కొత్త రూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం వెయిట్ లిస్ట్ టికెట్ ఉన్న ప్రయాణీకులు రిజర్వ్డ్ కోచ్ లలో ఎక్కడానికి వీలు లేదు. రద్దీని తగ్గించడానికి, కన్నార్మ్ టికెట్లు ఉన్న వ్యక్తులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, వెయిట్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణీకులు జనరల్ కోచ్‌లలో ఎక్కవచ్చు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, వారికి జరిమానా విధించే అవకాశం ఉంటుంది. బోర్డింగ్ స్టేషన్ నుంచి తదుపరి స్టేషన్ వరకు అయ్యే ఛార్జీతో పాటు నాన్-ఏసీకి రూ.250, ఏసీకి రూ.440 వసూలు చేస్తారు. అంతేకాదు, వారిని రైలు నుంచి కిందికి దింపుతారు.
Read Also: విశాఖ నుంచి నేరుగా బెంగళూరుకు వందే భారత్ స్లీపర్?