BigTV English

Netizens fires on T20 WC Schedule 2024: ఆటగాళ్ల మంచీచెడ్డా పట్టించుకోరా..? బిజీబిజీ షెడ్యూళ్లపై నెట్టింట తీవ్ర విమర్శలు!

Netizens fires on T20 WC Schedule 2024: ఆటగాళ్ల మంచీచెడ్డా పట్టించుకోరా..? బిజీబిజీ షెడ్యూళ్లపై నెట్టింట తీవ్ర విమర్శలు!

Netizens Fires on T20 World Cup 2024 Schedule: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐపీఎల్ క్రికెట్ లీగ్ జరిగే ఇండియాలో ఒకవైపు మ్యాచ్ లు జరుగుతుంటే, మరోవైపు ఐసీసీ టీ 20 ప్రపంచకప్ షెడ్యూల్ ను కొంపలు అంటుకునేలా, అంత దగ్గరగా పెట్టడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తలపడుతున్న పది జట్లలో చాలామంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వారందరూ తమ దేశాల తరఫున టీ 20 ప్రపంచకప్ లో పాల్గొంటున్నారు.


ఇప్పుడు వారందరూ తట్టా బుట్టా, బ్యాట్, బాల్ పట్టుకుని విమానాలు పట్టుకుని బయలుదేరారు. ఇంతవరకు క్రికెట్ ఆడి, ఆడి, డైలీ ప్రాక్టీసులు చేసి అలసిపోయిన క్రికెటర్లు, తమ దేశం వెళ్లి, వెంటనే మళ్లీ మరో విమానం పట్టుకుని రోజుల తరబడి ప్రయాణాలు చేయడం సాధ్యమేనా? అని నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏమిటంత కంగారు? ఏమిటంత ఆదుర్దా? ఏమిటంత దుగ్ధ? అని మండిపడుతున్నారు. క్రికెట్ బోర్డులన్నీ కూడా కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చి పడుతుంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుందామని చూస్తున్నాయి. ఈ క్రమంలో ఆటగాళ్ల ఆరోగ్యంపై, ఫిట్ నెస్ పై శ్రద్ధ చూపించడం లేదు. వీడు కాకపోతే ఇంకొకడు అనుకుంటూ ముందుకు పోతున్నారు. ఆటగాళ్ల భవిష్యత్తులతో ఆటలాడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఇంత అతి ఎప్పటికైనా ప్రమాదమే అంటున్నారు.


Also Read: ధోని 110 మీటర్ల సిక్స్.. చెన్నై కొంప ముంచిందా..?

టీమ్ ఇండియా విషయానికి వస్తే మార్చి 22న ఐపీఎల్ ప్రారంభమైంది. మే 26 వరకు ఉంటుంది. అంటే రెండు నెలలుగా క్రికెట్ ఆడుతున్నారు. టీ 20 ప్రపంచకప్ లో ఆడే ప్రతీ ఆటగాడు ఇందులో ఏదొక జట్టులో ఉన్నాడు. అంతా అలిసిపోయి ఉన్నారు. ఫైనల్ జట్టులో ఆడేవారు తప్ప, మిగిలిన వారిని ముందుగానే విమానం ఎక్కించి పంపుతున్నారు. అంటే టీమ్ ఇండియా రెండు దఫాలుగా అమెరికా వెళ్ల నుంది.

అనంతరం ఫైనల్ మ్యాచ్ మే 26న జరిగిన వెంటనే, మిగిలిన వాళ్లు బయలుదేరాలి. ఇంటికి వెళ్లి కాసేపు అలసట తీర్చుకునే మార్గం కూడా వారికి కనిపించడం లేదు. ఇంత అలుపెరగని క్రికెట్ ఆడటం వల్ల మానసికంగా అలసిపోవడమే కాదు. ఇంటి వద్ద పిల్లలతో ఎటాచ్ మెంట్ కూడా దూరమైపోతుందని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Also Read: KKR vs SRH who is winner: ఐపీఎల్‌లో ఆసక్తి సమరం, గెలుపు ఎవరిది? ఓడినా మరో ఛాన్స్..

అందరూ అనేదేమిటంటే ఇంత టైట్ షెడ్యూల్ పెట్టడం ఎందుకు? అంటున్నారు. మానసిక అశాంతిలో అక్కడికి వెళ్లి కప్ కొట్టలేక వెనక్కి తిరిగి వస్తే, ఎవరికి నష్టం? భారత క్రికెట్ కి నష్టమని అంటున్నారు. మరి క్రికెట్ పెద్దల చెవులకు వినిపిస్తుందో లేదో తెలీదు.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×