Sai Sudarshan – Pant: భారత యువ ఆటగాడు సాయి సుదర్శన్ తన టెస్ట్ కెరీర్ ని ఆరంభించాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో సాయి సుదర్శన్ అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్ లో అనవసర షాట్ కి ప్రయత్నించి వికెట్ కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
Also Read: Dhoni Fan: ఆ లేడీతో Ms ధోని రిలేషన్… సీక్రెట్ గా పార్టీలు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
దీంతో ఇది పూర్తిగా అతడి తడబాటు వల్లే జరిగిందని.. దీనికి పెద్దగా విమర్శించాల్సిన అవసరం లేదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ 48 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈసారి మాత్రం సాయి సుదర్శన్ అవుట్ అయిన తీరుపై విమర్శలు వెళ్లువెత్తాయి. బెన్ స్టోక్స్ వేసిన లెగ్ – సైడ్ ట్రాప్ లో అతడు మరోసారి చిక్కుకున్నాడు.
మొదటి ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ కోసం లెగ్ స్లిప్, మిడ్ వికెట్, ఫైన్ లెగ్ వద్ద ఫిల్టర్లను ఉంచాడు బెన్ స్టోక్స్. కానీ రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం అతడు మరోలా ప్లాన్ చేసుకున్నాడు. స్టోక్స్ ఓవర్ ది వికెట్ నుండి బౌలింగ్ చేస్తూ.. సాయి సుదర్శన్ ని ఎల్పిడబ్ల్యూ ట్రాప్ లో ఇరికించాలని ప్రయత్నించాడు. స్టోక్స్ అతడి బ్యాట్స్ పై బాల్స్ వేస్తూ రెండుసార్లు ఇన్ స్వింగర్లను కూడా వేశాడు. మొదట్లో స్టోక్స్ కి సరైన లైన్ దొరకలేదు. ఆ సమయంలో సుదర్శన్ కూడా నెమ్మదిగా కుదురుకుంటున్నాడు.
ఆ తర్వాత 21 ఓవర్ లో స్టోక్స్ మళ్లీ బౌలింగ్ కి దిగాడు. అతడు మొదట ఆఫ్ – స్టంప్ వెలుపల బౌలింగ్ చేసి.. ఆ తర్వాత బంతిని భారీ ఇన్ స్వింగర్ గా మిడిల్ స్టంప్ కి విసిరాడు. ఆ బంతిని సాయి సుదర్శన్ మరోసారి ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఈసారి బంతి నేరుగా మిడ్ వికెట్ లో ఉన్న జాక్ క్రాలీ చేతుల్లో చిక్కింది. ఆ బంతిని సులభంగా అందుకున్నాడు జాక్. అయితే సుదర్శన్ ఇలా అవుట్ కావడంపై ఎక్స్పర్ట్స్, అభిమానుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఐపీఎల్ లో అదరగొట్టిన సుదర్శన్.. తన టెస్ట్ అరంగేట్రంలో ఈ తరహా ప్రదర్శన చేయడంపై అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ఇంత చీప్ గా అవుట్ అవుతావా..? అని కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్ సాధించిన ప్లేయర్ గా గుజరాత్ టైటాన్స్ {GT} కి చెందిన సాయి సుదర్శన్ నిలిచిన విషయం తెలిసింది. ఈ సీజన్ ఐపిఎల్ లో అతడు 759 పరుగులు చేశాడు. కానీ తొలి టెస్ట్ లో మాత్రం తీవ్ర నిరాశపరిచాడు.
Also Read: ENG vs IND: బుమ్రా డేంజర్ బాల్.. అదిరిపోయే క్యాచ్ పట్టిన సిరాజ్.. అయినా కూడా నాటౌట్… వీడియో వైరల్
అదే సమయంలో ఐపీఎల్ లో పూర్తిగా విఫలమైన భారత జట్టు వికెట్ కీపర్, ప్రస్తుత టెస్ట్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లోను మరో సెంచరీని నమోదు చేశాడు. తద్వారా 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్ లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆసియా వికెట్ కీపర్ గా పంత్ నిలిచాడు. కుమార సంగక్కర దగ్గర నుండి మహేంద్రసింగ్ ధోని వరకు.. ఏ ఆసియా కీపర్ కూడా సాధించలేని రికార్డ్ ని రిషబ్ పంత్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో ఎవడైనా ఆడతాడు.. టీం ఇండియాకు ఆడితేనే మగాడు అవుతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.