Vande Bharat Express Water Leak: భారతీయ రైల్వేలో అత్యాధుని రైలుగా గుర్తింపు తెచ్చుకున్న వందేభారత్ లోనూ ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా ఏసీ డెక్ నుంచి వాటర్ లీకేజీ అయ్యింది. ఈ నీళ్లు పడి ఓ ప్రయాణీకురాలితో పాటు ప్రయాణీకులు లగేజీ కూడా తడిసిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను @Benarasiyaa అనే నెటిజన్ షేర్ చేశాడు. “ఢిల్లీకి వెళ్లే 22415 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో అన్ లాక్ చేయబడిన ఉచిత జలపాత సేవ” అని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు ఇంకా స్పందించలేదు.
अब वंदे भारत में यात्रियों के लिए झरने की सुविधा.
इस वर्ल्ड क्लास सुविधा का लाभ उठाकर आप नहाते हुए यात्रा कर सकते हैं.
ये सब 'उनके' ओजस्वी मार्गदर्शन में संभव हो सका है. बोलिए Thank You ….. pic.twitter.com/7yIw3iSwPc
— Ranvijay Singh (@ranvijaylive) June 24, 2025
2024లోనూ వందేభారత్ లో వాటర్ లీకేజీ
వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో వాటర్ లీకేజీ ఇదే తొలిసారి కాదు, 2024లోనూ ఇలాంటి ఘటన ఎదురయ్యింది. అప్పట్లో ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నార్త్ రైల్వే పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఉత్తర రైల్వే అప్పట్లో వివరణ కూడా ఇచ్చింది. తాత్కాలిక సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వెంటనే ఈ సమస్యను పరిష్కరించినట్లు వివరించింది. “తాత్కాలికంగా పైపులు మూసుకుపోవడం వల్ల కోచ్ లో స్వల్పంగా నీటి లీకేజీ కనిపించింది! రైలులోని సిబ్బంది కూడా దీనిని పరిశీలించి సరిచేశారు. దీనివల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము” అని ఉత్తర రైల్వే అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
తాజా ఘటనపై నెటిజన్ల సటైర్లు
తాజాగా వందేభారత్ రైల్లో వాటర్ లీకేజీ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది కామెడీగా కామెంట్స్ పెడుతుంటే మరికొంత మంది సటైర్లు వేస్తున్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో వాటర్ లీకేజీకి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. “ఎయిర్ ఇండియా ప్రయాణీకులు మాత్రమే ఎందుకు ఆనందించాలి? వందేభారత్ ప్రయాణీకులు కూడా ఎంజాయ్ చేయాలి” అని రాసుకొచ్చాడు. “గొప్పలు చెప్పుకోవడం కాదు, ప్రయాణీకులకు గొప్ప సేవలు అందించడం రైల్వే అధికారులు నేర్చుకోవాలి” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనను మొత్తం వందేభారత్ రైళ్లకు ఆపాదించడం సరికాదు. అనుకోని పొరపాట్ల కారణంగా ఇలాంటి ఘటనలను జరుగుతాయి. వాటిని బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు” అని మరో నెటిజన్లు అభిప్రాయపడ్డాడు. “వందే భారత్ లో వాటర్ ఫాల్స్ సౌకర్యం” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
सिर्फ @airindia वाले ही क्यों झरनें का मजा़ लें?
~ @AshwiniVaishnaw 😎 pic.twitter.com/ScQ9vkqFiV— Nishant Pant (@nishantpant_in) June 24, 2025
Read Also: ఇండియన్ బుల్లెట్ రైలుకు.. చైనా రెడ్ సిగ్నల్.. అవి ఇవ్వలేమంటూ పేచీ!