PBKS vs RCB : ఐపీఎల్ 2025 సీజన్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి ఫైనల్ కి చేరుకుంది. రెండో జట్టుగా నిన్న ముంబై ని ఓడించిన పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనున్నాయి. అయితే 2016లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. తొలి ఫైనల్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వెళ్లగా.. రెండో ఫైనల్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వెళ్లింది. క్వాలిఫయిర్ 1లో అప్పుడు కూడా ఆర్సీబీ జట్టు.. సన్ రైజర్స్ జట్టు పై విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. కానీ ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ను మాత్రం ఆర్సీబీ జట్టు ఓడించలేకపోయింది. తొలుత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేసింది. సుమారు 220 పరుగుల వరకు చేయగలిగింది. ఆర్సీబీ ఛేజింగ్ లో పోరాడినప్పటికీ 8 పరుగులు తేడాతో ఓడిపోయింది.
Also Read : Gukesh – Magnus : అదరగొట్టిన గుకేశ్.. కార్ల్‌సన్‌పై సూపర్ విక్టరీ.. మనోడి దెబ్బకు బల్ల గుద్దాడు
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 2017లో వచ్చిన బాహుబలి 2 సినిమా సీన్లు ఆ వీడియోలో రిపీట్ అయ్యాయి. అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్ నరికిన విలన్ తలను పట్టుకొని అనుష్క వచ్చినట్టు.. నిన్న శ్రేయాస్ అయ్యర్ విజయం సాధించడంతో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతిజింటా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తలను పట్టుకొస్తుంది. ఇక అదేవిధంగా బాహుబలి మూవీలో రాణా మాదిరిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ బైనాక్యులర్ లో వీక్షిస్తుండగా.. నాజర్ పాత్రలో విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ ఫొటో ను చూసి ఆశ్చర్యపోతాడు. బాహుబలి సినిమాలో కూడా అనుష్క, ప్రభాస్ ఫొటోలను చూసి బల్లాల దేవ పాత్రలో ఉన్న రాణా, నాజర్ లు ఏవిధంగా ఆశ్యర్యపోతారో ఈ వీడియోలో ఆ విధంగా ఆశ్యర్యపోయినట్టు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎలాగో పంజాబ్ ని మేము క్వాలిఫయర్ 1లో ఓడించామని.. అలాగే ఫైనల్ లో కూడా ఓడిస్తామనే ధీమాలో ఉంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాత్రం గత ఏడాది తాను కెప్టెన్ గా ఉండి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కి టైటిల్ అందించామని.. ప్రస్తుతం పంజాబ్ జట్టు కి కూడా టైటిల్ ని అందిస్తాననే ధీమాలో ఉన్నాడు. మరీ ఈ రసవత్తరమైన మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు జట్లు రెండింటిలో కూడా బలంగానే ఉన్నాయి. కానీ పంజాబ్ జట్టును మొన్న బెంగళూరు జట్టు తక్కువ స్కోర్ కే కట్టడి చేయడంతో.. బెంగళూరు మరోసారి అలాగే ఆడుతుందని అభిమానులు పేర్కొంటుంటే.. పంజాబ్ మాత్రం నిన్న ముంబై జట్టు అదే అహ్మదాబాద్ స్టేడియంలో ఎలాగైతే ఓడించామో.. అలాగే ఫైనల్ లో ఆర్సీబీ జట్టు ని కూడా ఓడించి తొలి సారి పంజాబ్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడనుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ రసవత్తరమైన పోరులో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే.. రేపు రాత్రి వరకు వేచి ఉండాల్సిందే.
Final mein entry 🥶pic.twitter.com/bfzreMEzIM
— Gagan🇮🇳 (@1no_aalsi_) June 2, 2025