Gukesh – Magnus : వరల్డ్ ఛాపింయన్ నార్వే చెస్ 2025లో మాజీ వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ పై ఘన విజయం సాధించారు. చెస్ 2025లో ఆరో రౌండ్ లో గుకేశ్ ను విజయం వరించింది. కార్ల్ సన్ పై గుకేశ్ పై ఇదే తొలి క్లాసికల్ విజయం.. ఓటమి బాధలో కార్ల్ సన్ టేబుల్ ను గట్టిగా కొట్టేశారు. తరువాత తేరుకొని గుకేశ్ కు రెండుసార్లు సారీ చెప్పారు. గత ఏడాది ఇదే టోర్నీలో కార్ల్ సన్ ను భారత స్టార్ చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద ఓడించిన విషయం తెలిసిందే. నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మరోసారి తన ప్రతిభను నిరూపించాడు. ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ పై ఓడించడం గుకేశ్ కి ఇదే మొదటిసారి.
Also Read : klaasen retirement: అంతర్జాతీయ క్రికెట్ కు కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్
అదేవిధంగా ఈ విజయం తో తొలి రౌండ్ లో ఓటమికి గుకేశ్ ప్రతీకారం తీర్చుకున్నట్టు అయింది. ఇక ఓటమి ని తట్టుకోలేక కార్ల్ సన్ పిడికిలితో ఒక్కసారిగా చెస్ బోర్డు టేబుల్ ను గట్టిగా కొట్టాడు. వెంటనే గుకేశ్ కి సారి చెప్పి వెళ్లి పోయాడు. మరోవైపు చెస్ చరిత్రలోనే నెంబర్ వన్ ఆటగాడిని ఓడించడం వల్ల గుకేశ్ కొన్ని సెకన్ల పాటు షాక్ లోనే ఉండిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నార్వే చెస్ టోర్నీలో భాగంగా ఆరో రౌండ్ లో తెల్ల పావులతో బరిలోకి దిగిన గుకేశ్ తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడాడు. కార్ల్ సన్ చేసిన చిన్న తప్పును చక్కగా వినియోగించుకొని పూర్తి గా గేమ్ పై పట్టు సాధించాడు. సొంత వేదిక పై మాగ్నస్ ను బోల్తా కొట్టించాడు. కార్ల్ సన్ మ్యాచ్ ఆద్యంతం పై చేయి సాధించినప్పటికీ.. ఒత్తిడిని చిత్తు చేస్తూ గుకేశ్ చివర్లో ప్రత్యర్థికి చెక్ మేట్ పెట్టాడు. గత ఏడాది జరిగిన ఇదే టోర్నీలో మరో భారత స్టార్ ప్లేయర్ ప్రజ్ఞానంద చేతిలో ఓడిపోయాడు.
ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి కార్ల్ సన్ స్పందన.. గుకేశ్ ఎమోషన్ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీని పై గుకేశ్ బాగా ఆఢావు అంటూ అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. నార్వే చెస్ 2025లో కార్ల్ సన్ పై తొలి విజయం మరో మైలు రాయిని సాధించడానికి నాంది అని పేర్కొన్నారు. నిశ్చబ్దం, విశ్వాసం, టార్గెట్ పై ఉంచిన తీవ్రమైన దృష్టి ఏమి సాధించవచ్చో గుకేశ్ ప్రపంచానికి చూపించాడు అంటూ ట్విట్టర్ వేదిక గా పోస్ట్ చేశారు. మరోవైపు గుకేశ్ తాతా శంకర్ రాజేష్ స్పందించారు. ఈ విజయంతో చాలా గర్వపడుతున్నారని తెలిపారు. రోజు రోజుకు మరింత మెరుగు పడుతున్నారని.. నెంబర్ వన్ కావడమే గుకేశ్ లక్ష్యం అని.. ప్రపంచ నెంబర్ 1 కార్ల్ సన్ ను ఓడించడం గర్వించదగిన విజయాల్లో ఒకటి అని తెలిపారు.
?igsh=MTBpdzhkZjZjdmE2cw==