IND vs ENG 1st Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొన్ని నిమిషాల క్రితమే ఈ టోర్నమెంట్ షురూ అయింది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ హెడ్డింగ్ లే లోని లీడ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇందులో టాస్ గెలిచిన… ఇంగ్లాండ్… మొదట బౌలింగ్ తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయబోతోంది. మరికొద్ది క్షణాల్లోనే మ్యాచ్ కూడా ప్రారంభం కానుంది.
రంగంలోకి కొత్త ప్లేయర్… జోష్ లో టీమిండియా
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో కొత్త ప్లేయర్ రంగంలోకి దిగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో అదరగొట్టిన సాయి సుదర్శన్.. తన తొలి టెస్ట్ మ్యాచ్ లో అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అతనికి క్యాప్ అందించింది టీం ఇండియా యాజమాన్యం. అలాగే చాలా సంవత్సరాల తర్వాత కరుణ్ నాయక్ జట్టులోకి వస్తున్నాడు. శార్దూల్ ఠాకూర్ కూడా బరిలో దిగుతున్నాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India Vs England) మధ్య ఐదు టెస్టులు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ లీడ్స్ వేదికగా మొదటి టెస్ట్ ప్రారంభమైంది. అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోతున్న ఐదు టెస్టులు… ప్రతిరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు మాత్రమే ప్రారంభమవుతాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్లు ప్రారంభం అయ్యేవి. కానీ ఇంగ్లాండులో మ్యాచులు జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్లు ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోతున్న ఐదు టెస్టుల సిరీస్ జియో హాట్ స్టార్, సోనీ స్పోర్ట్స్ లో చూడవచ్చు. అదే సమయంలో.. డిడి స్పోర్ట్స్ లో కూడా ఈ ప్రసారాలను అందిస్తున్నారు. డిడి స్పోర్ట్స్ లో టెస్ట్ సిరీస్ ఉచితంగా చూడవచ్చు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ప్లేయర్ల లిస్ట్
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (c), రిషబ్ పంత్(w), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (c), జామీ స్మిత్(w), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్
Also Read: Maxwell: 13 సిక్సర్లతో మ్యాక్స్‌వెల్ భయంకరమైన సెంచరీ.. వాడో మోసగాడు అంటూ ప్రీతి జింటా ఫైర్ !